Site icon HashtagU Telugu

NTR : వార్ 2లోని ఎన్టీఆర్ లుక్‌ని లీక్ చేసిన చేసిన ఊర్వశి రౌటెలా.. సెల్ఫీ పిక్ వైరల్..

Urvashi Rautela Shares A Selfie Photo Of War 2 Star Ntr

Urvashi Rautela Shares A Selfie Photo Of War 2 Star Ntr

NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్.. రా ఏజెంట్ గా ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ మూవీ.. ఇన్నాళ్లు హృతిక్ తో షూటింగ్ జరుపుకుంటూ వచ్చింది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ కోసం ఎన్టీఆర్ కసరత్తులు చేస్తున్నారు.

ముంబైలోని ఓ జిమ్ లో ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇక ఆ జిమ్ కి బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌటెలా కూడా వెళ్లడంతో.. “ఎన్టీఆర్ తో ఓ సెల్ఫీ దిగి ఆ ఫొటోతో తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేశారు. మన గ్లోబల్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ గారు ఎంతో క్రమశిక్షణ, నిజాయితీ, వినయం కలిగి ఉంటారు. అంతేకాదు ఏదైనా చాలా స్ట్రెయిట్ గా మాట్లాడుతుంటారు. ఎన్టీఆర్ గారు మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. అలాగే మీరు చూపించిన ప్రేమ మరియు ప్రేరణకు ధన్యవాదాలు. భవిషత్తులు మీతో కలిసి పని చేసే రోజుల కోసం ఎదురు చూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉంటే, ఊర్వశి షేర్ చేసిన సెల్ఫీ పిక్ లో ఎన్టీఆర్ లుక్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త లుక్ వార్ 2 సినిమా కోసమే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ కొత్త లుక్ ని చూసిన ఫ్యాన్స్.. వార్ 2 సినిమాలో రా ఏజెంట్ గా ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నారో అని ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఈ మూవీ కోసం ఎన్టీఆర్ మొత్తం 60 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారు.

Also read : NTR – Allu Arjun : ఏడేళ్ల తరువాత ఎన్టీఆర్ రికార్డుని బ్రేక్ చేసిన అల్లు అర్జున్..