బాలీవుడ్ (Bollywood) అందాల భామ ఊర్వశి రౌతెల అక్కడ తన గ్లామర్ షోతో మెప్పు పొందుతుంది. సోలో హీరోయిన్ ఛాన్స్ ల కన్నా బీ టౌన్ హాట్ బ్యూటీగా అమ్మడు అవకాశాలను అందుకుంటుంది. ఐతే ఆ క్రేజ్ తోనే ఇప్పుడు సౌత్ సినిమా ఆఫర్లను దక్కించుకుంటుంది. ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో ఆడి పాడింది. ప్రస్తుతం ఎన్.బి.కె 109 లో కూడా అమ్మడు ఛాన్స్ అందుకుంది.
ఐతే తన కెరీర్ లో ఎక్కువగా తన కన్నా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న హీరోలతోనే నటించింది ఊర్వశి. తన మొదటి సినిమా కూడా బాబీ డియోల్ తో నటించింది. ఆ సినిమా టైం లో తన వయసు 19 ఏళ్లు మాత్రమే అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అమ్మడు. బాబీ డియోల్ తో 38 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా నటించానని అన్నది ఊర్వశి.
ఏజ్ లో పెద్దవాడితో డేట్..
స్క్రీన్ పై హీరో హీరోయిన్ ఎలా ఉన్నారన్నది చూడాలి కానీ ఇలా వారి రియల్ ఏజ్ అసలు పట్టించుకోకూడదని అంటుంది. రియల్ లైఫ్ లో తను నిజంగానే తన కన్నా ఏజ్ లో పెద్దవాడితో డేట్ చేస్తే అప్పుడు మాట్లాడాలి కానీ సినిమా పరంగా అదేమి తప్పు కాదని అంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమా ఛాన్సులు రావడమే కష్టం అనుకునే వారు కొందరు ఉండగా వచ్చిన అవకాశాలను ఏజ్ గ్యాప్ లేదా మరో రీజన్ తో కాదనలేం కాబట్టి అమ్మడు సరైన ఆన్సరే ఇచ్చిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) సినిమాలో నటిస్తున్న అమ్మడు తెలుగులో మరిన్ని ఛాన్స్ లు రావాలని ఆశిస్తుంది.
Also Read : Mrunal Thakur : మృణాల్ అక్కడ అదరగొట్టేస్తుందిగా..!