AP CM : పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం ను చేసిన హీరోయిన్..

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బాలీవుడ్ హీరోయిన్ ఏకంగా ఏపీ సీఎం ను

Published By: HashtagU Telugu Desk
Nasser Reacts On Pawan Kalyan Comments Over Tamil Industry

Nasser Reacts On Pawan Kalyan Comments Over Tamil Industry

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బాలీవుడ్ హీరోయిన్ ఏకంగా ఏపీ సీఎం ను చేయడమే కాదు తన అధికార ట్విట్టర్ లో APCM అంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది.

పవన్ కళ్యాణ్సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రో (#BRO) చిత్రానికి సముద్రఖని డైరెక్ట్ చేయగా..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించారు.

తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతమ్ (Vinodhaya Sitham) సినిమా రీమేక్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier), కృతిక శర్మ (Ketika Sharma) హీరోయిన్లు నటించగా, ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు.

ఈరోజు ఈ సినిమా విడుదల సందర్భాంగా చిత్ర నటి నటులు సోషల్ మీడియా ద్వారా విషెష్ అందిస్తున్నారు. ఈ క్రమంలో ఊర్వశి రౌతేలా కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ”ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న విడుదల అవుతోన్న ‘బ్రో ది అవతార్’ సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అహంకారపూరితంగా నడుచుకునే ఓ యువకుడికి మరణించిన తర్వాత అవకాశం వస్తే… తన తప్పుల్ని ఎలా సరి చేసుకున్నాడు? అనేది సినిమా కథ. థియేటర్లలో కలుద్దాం” అని ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ట్వీట్ చేసింది. అలాగే ప్రీ రిలీజ్ వేడుకలో పవన్, సాయిలతో దిగిన ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసి అభిమానులు , జనసేన శ్రేణులు కరెక్ట్ గా చెప్పారండి..ఏపీకి కాబోయే సీఎం పవన్ కల్యాణే అని రిప్లయ్ ఇస్తుంటే..మరికొంతమంది మాత్రం ఏపీ కి సీఎం జగన్ మేడం..కాస్త తెలుసుకొని ట్వీట్ చెయ్యండి అంటూ రిప్లయ్ ఇస్తున్నారు.

వాస్తవానికి ప్రీ రిలీజ్ వేడుక (BRO)లో అభిమానులు ఎక్కువగా సీఎం..సీఎం అంటూ కేకలు పెట్టడం తో ఊర్వశి నిజంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సీఎం కావొచ్చని అనుకుంది..అందుకే ఇలా ట్వీట్ చేసి ఉంటుందని అంత భావిస్తున్నారు. మొత్తం మీద ఊర్వశి చేసిన ట్వీట్ ఇటు చిత్ర చిత్రసీమలో ..అటు రాజకీయంలో చర్చ గా మారింది.

Read Also: Captain Miller: భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ తో కెప్టెన్ మిల్లర్, డిఫరెంట్ లుక్ లో ధనుష్

  Last Updated: 28 Jul 2023, 11:42 AM IST