Site icon HashtagU Telugu

Kabzaa: ఉపేంద్ర కబ్జా ట్రైలర్ మామూలుగా లేదుగా.. ఏకంగా కేజీఎఫ్ రేంజ్ లో సస్పెన్స్ ఉందిగా?

Whatsapp Image 2023 03 05 At 17.07.21

Whatsapp Image 2023 03 05 At 17.07.21

Kabzaa: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర మంచి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడుగా మంచి పేరు సంపాదించుకొని మంచి అభిమానాని సొంతం చేసుకున్నాడు. కన్నడ భాషతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటించాడు. ఇక ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాడు. వరుస సినిమాలతో బాగా బిజీగా దూసుకుపోతున్నాడు. చాలా వరకు మంచి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన కబ్జా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆర్ చంద్రు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, సుదీప్, శ్రియ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మార్చ్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఎప్పటికప్పుడు ఉపేంద్ర సినిమా షూటింగు గురించి కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినీ బృందం ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. అయితే ట్రైలర్ మాత్రం మామూలుగా లేదని చెప్పాలి.

ఒక సామ్రాజ్య నిర్మాణం నరికితే కత్తితో కాదు.. ఆ కత్తిని పట్టుకున్న బలమైన చేతితో సాధ్యం అనే డైలాగ్ ఉపేంద్ర అద్భుతంగా చెప్పారు. అయితే అచ్చం కేజిఎఫ్ సినిమా తలపించే సన్నివేశాలు ఉండటంతో బహుశా కేజిఎఫ్ మాదిరిగానే ఉంటుందేమో అని అనిపిస్తుంది. అసలు కథ ఏంటో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టేశారు. కేజిఎఫ్ కూడా ఇటువంటి సస్పెన్స్ తోనే అదరగొట్టింది. ఇక ఈ సినిమా కూడా రికార్డు బద్దలు కొట్టడం ఖాయమని తెలుస్తుంది.

Exit mobile version