కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) తన లేటెస్ట్ సినిమా యుఐ తో ప్రేక్షకు ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తనకెక్కిచ్చిన యుఐ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాను తెలుగులో కూడా భారీగా ప్రమోట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఉపేంద్ర చెప్పారు.
తన సినిమాలు ఇక్కడ కూడా ప్రేక్షకుల అభిమానాన్నిపొందినందుకు సంతోషంగా ఉందని అన్నారు. యుఐ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్మకంగా చెప్పారు ఉపేంద్ర.
కల్కిలో మైథాలజీ టచ్ ఇచ్చారు కాబట్టి.. యుఐ లో సైకలాజికల్ కల్కి (Kalki) చూస్తారని నమ్మకంగా చెప్పారు ఉపేంద్ర. యుఐ (UI) సినిమా తెలుగు ప్రమోషన్స్ లో ఉపేంద్ర మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒకప్పుడు చిరంజీవికి కథ చెప్పానని కాకపోతే అప్పుడు ఆయన ఇమేజ్ ని అంచనా వేయలేకపోయానని చెప్పారు.
చిరంజీవి సినిమా అంటే డాన్స్ లు ఫైట్లు యాక్షన్ అన్ని ఉండాలని.. ఆయన అంచనాలను అందుకోలేకపోయానని చెప్పారు ఉపేంద్ర. చిరంజీవిని తక్కువ అంచనా వేసినట్టు చెప్పారు.
ఇక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా పొందుతున్న ఆదరణ గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు ఉపేంద్ర. సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా భారీ విజయాన్ని అందుకుంటున్నాయని చెప్పారు.
ఉపేంద్ర యుఐ సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఫ్యాన్స్ అంతా ఆయన నటించిన A, ఉపేంద్ర, రక్త కన్నీరు సినిమాల డైలాగులు ట్రెండ్ చేస్తున్నారు. ఉపేంద్ర చివరగా తెలుగులో అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి లో నటించారు.
Also Read : Shruthi Hassan : శృతి హాసన్ ఎందుకిలా చేస్తుంది..?