ప్రతివారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో అలాగే ఓటీటీ లో సందడి చేయడానికి సినిమాలు వెబ్ సిరీస్ లు రెడీగా ఉన్నాయి. ఈ వారం ఓటిటి థియేటర్లలో ఏ ఏ సినిమాలు వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కీలక పాత్రలో నటించిన పౌరాణిక ప్రేమ కథ చిత్రం శాకుంతలం సినిమా ఏప్రిల్ 14 నా ప్రపంచవ్యాప్తంగా త్రీడీ వర్షన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గుణశేఖర్ దర్శకత్వం వర్తించిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అలాగే హీరో రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం రుద్రుడు. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఇతర భాషలో విడుదలైన విజయవంతమైన సినిమాలను కాస్త ఆలస్యంగా తెలుగులోకి విడుదల చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. మరి ఈ వారం విడుదల కాబోతున్న పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ విడుదల: పార్ట్ 1. సూరి, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ఇటీవల తమిళంలో విడుదలై ప్రేక్షకులకుతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. ఏప్రిల్ 15వ తేదీన తెలుగులో విడుదల కానుంది.
అలాగే దారుణమైన హత్య, ఒక తెలివైన హంతకుడు, నలుగురు అనుమానితులు నాలుగు రహస్యాలు… ఒకే ఒక్క నిజం.. వీటన్నింటిని చేధించే ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారి ఇలాంటి ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రం అసలు. పూర్ణ, సూర్యకుమార్, సత్యకృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈటీవీ విన్ ద్వారా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా దాస్ కా ధమ్కీ. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ ను అందుకుంది.ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఆహా వేదికగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కాబోతున్న వెబ్ సిరీస్ విషయానికి వస్తే..
ఫ్లోరియా మాన్ అనే వెబ్‌సిరీస్ ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే అబ్సెషన్ అనే వెబ్‌సిరీస్ ఏప్రిల్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. క్వీన్ మేకర్ అనే కొరియన్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే ది లాస్ట్ కింగ్‌డమ్ అనే హాలీవుడ్ మూవీ కూడా ఏప్రిల్ 14 న స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే అమెజాన్ లో విడుదల కాబోతున్న వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ది మార్వెలస్ మిస్సెస్ అనే వెబ్‌సిరీస్ ఏప్రిల్ 14 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే మిస్సెస్ అండర్‌కవర్ అనే హిందీ వెబ్ సిరీస్ ఏప్రిల్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ అనే వెబ్‌సిరీస్ ఏప్రిల్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓ కల తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 13నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఎంఎక్స్ ప్లేయర్ లో విడుదల కాబోతున్న వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. ది సాంగ్ ఆఫ్ గ్లోరీ అనే హిందీ సిరీస్ ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.