Chiranjeevi : మావయ్యతో కోడలి లవ్లీ వీడియోస్.. ఉపాసన ప్రశ్నలు చిరు సమాధానాలు..

పద్మ విభూషణ్ అందుకునేముందు చిరంజీవితో షార్ట్ ఇంటర్వ్యూ చేసిన ఉపాసన. ఉపాసన ప్రశ్నలు చిరు సమాధానాలు ఏంటంటే..

Published By: HashtagU Telugu Desk
Upasana Short Interview Before Chiranjeevi Facilitate Of Padma Vibhushan

Upasana Short Interview Before Chiranjeevi Facilitate Of Padma Vibhushan

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ అవార్డుల పురస్కారం నిన్న (గురువారం) ఢిల్లీలోని రాజభవనంలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, కూతురు సుస్మిత, రామ్ చరణ్, ఉపాసన కూడా హాజరయ్యారు.

ఇక అవార్డు కార్యక్రమానికి వెళ్లేముందు డ్రెస్సింగ్ రూమ్ లో ఒక చిన్న ఫోటోషూట్ ని చిరంజీవికి నిర్వహించారు. ఆ సమయంలో కోడలు ఉపాసన మావయ్య చిరుని ఇంటర్వ్యూ చేసారు. అందుకు సంబంధించిన వీడియోలను ఉపాసన తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఒక వీడియోలో ఉపాసన చిరంజీవిని ప్రశ్నిస్తూ.. “మావయ్య క్లీంకార మరియు నాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి..?” అడిగారు. దానికి చిరు బదులిస్తూ.. “తాను నీకు మరో ప్రతిరూపం” అంటూ చిరు బదులిచ్చారు. దానికి ఉపాసన రియాక్ట్ అవుతూ.. “అది కాదు మావయ్య, మా ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్. మా ఇద్దరి తాతయ్యలు పద్మ విభూషణ్ గ్రహీతలు” అంటూ చెప్పుకొచ్చారు. ఉపాసన తాతయ్య ప్రతాప్ చంద్రారెడ్డి 2010లో పద్మవిభూషణ్ అందుకున్నారు.

ఇక మరో వీడియోలో ఉపాసన అడిగిన ప్రశ్న.. “మావయ్య ఈరోజు ఈ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి..?” అంటూ అడిగారు. దానికి చిరు బదులిస్తూ.. “ఒక మంచి కోడలు నాకు క్లీంకారని మానవరాలిగా ఇచ్చిన తరువాత దక్కిన అవార్డు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ లవ్లీ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

  Last Updated: 10 May 2024, 07:38 AM IST