గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ను సతీమణి ఉపాసన (Upasana) నిరాశకు గురి చేసిందట. ఉపాసన కోసం దాదాపు ఐదు గంటలు కష్టపడి ఎంతో ఇష్టంగా గిఫ్ట్ తీసుకొస్తే..ఉపాసన మాత్రం చూసి రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్నీ స్వయంగా చరణ్ చెప్పడమే కాదు గిఫ్ట్ ఇచ్చే వాళ్లకు ఓ సలహా కూడా ఇచ్చాడు.
We’re now on WhatsApp. Click to Join.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుమారుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన చరణ్..అతి తక్కువ టైంలోనే చరణ్ తండ్రి చిరంజీవి అనే రేంజ్ కి వెళ్ళాడు. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో తన తండ్రి పేరును నిలబెడుతూ వస్తున్నాడు. కేవలం చరణ్ మాత్రమే కాదు ఆయన సతీమణి ఉపాసన సైతం సమాజంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం సోషల్ సర్వీసెస్ చేస్తూ..ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఎంతో పేరు తెచ్చుకుంది. అలాగే ఇండస్ట్రీ లోనే కాదు బయటకూడా చరణ్ దంపతులను ఆదర్శ దంపతులుగా పిలుస్తుంటారు.
ఇక ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ తండ్రి అవ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ తెగ సంబరాలు జరుపుకున్నారు. కాగా ఆ పాపకి ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ .. ఉపాసన గురించి ఓ కామెంట్ చేశాడు. ‘ఉపాసన కోసం నేను 5 గంటలు వెతికి మరీ ఖరీదైన వాచ్ గిఫ్ట్ గా ఇచ్చాను. కానీ తను మాత్రం 5 సెకన్స్ లో.. నాకు వద్దు అంటూ రిజెక్ట్ చేసింది’ అని తెలిపాడు. ఒకవేళ అమ్మాయిలకు ఏదైనా వస్తువు కొని సర్ ప్రైజ్ ఇద్దామనుకునే వాళ్లు.. అలా చేయకుండా, వారికి ఏది నచ్చుతుందో ముందుగా కనుక్కోవడం బెటర్ అని సలహా ఇచ్చాడు.
Read Also :