Site icon HashtagU Telugu

Upasana: కూతురితో కలిసి రాష్ట్రపతిని కలిసిన ఉపాసన.. పాప ఫేస్ ఎప్పుడు చూపిస్తారంటూ ఫ్యాన్స్ ఫైర్?

Mixcollage 16 Mar 2024 12 17 Pm 986

Mixcollage 16 Mar 2024 12 17 Pm 986

తెలుగు సినీ ప్రేక్షకులకు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉపాసన ప్రస్తుతం ఒకవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు మాతృత్వాన్ని ఆస్వాదింస్తోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో యాక్టివ్ గా తనకు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఉపాసన రెగ్యులర్ గా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక చరణ్, ఉపాసనల కూతురు క్లిన్ కార ఫొటోలు షేర్ చేసినా ఎక్కడా ఫేస్ రివీల్ కాకుండా షేర్ చేస్తారు. తాజాగా ఉపాసన నేడు తన కూతురు క్లిన్ కారాతో కలిసి హైదరాబాద్ లో మెడిటేషన్ కి సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజిని కలిసింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రాష్ట్రపతిని కలిసిన ఫోటోలని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ నేడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లిన్‌ కారా కొణిదెలతో కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామేష్ దాజి మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అయితే ఒక ఫొటోలో క్లిన్ కారా కూడా ఉన్నా ఎప్పటిలాగే ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడింది ఉపాసన. దీంతో అభిమానులు ఇంకెప్పుడు ఈ మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ ని చూపిస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పాప ఫేస్ రెవిల్ చేయొచ్చు కదా అంటూ మండి పడుతున్నారు.