Upasana: కూతురు,భర్త గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన.. జలసీగా ఉందంటూ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్

Published By: HashtagU Telugu Desk
Mixcollage 07 Feb 2024 07 38 Am 6631

Mixcollage 07 Feb 2024 07 38 Am 6631

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరొకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మన అందరికీ తెలిసిందే. తనకు తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన తన కూతురు భార్య గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన భర్త రామ్ చరణ్ కూతురు క్లీంకార పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన తాతయ్య ప్రతాప్ రెడ్డి 91వ పుట్టినరోజు సందర్బంగా స్పెషల్ బుక్ లాంచ్ చేసి అనంతరం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. సాధారణంగా ఆడపిల్లలు ఎక్కువగా తండ్రికి దగ్గరగా ఉంటారు. మరీ మీ స్వీట్ లిటిల్ గర్ల్(క్లీంకార) గురించి ఏమిటి? అని యాంకర్ అడగ్గా ఉపాసన రియాక్ట్ అవుతూ వారిద్దరి మధ్య బాండింగ్ చూసి నాకు జలసీగా ఉంటుంది అని నవ్వుతూ చెప్పుకొచ్చింది ఉపాసన. కూతురు క్లీంకార తండ్రి చెర్రీ ని చూడగానే ముఖం విరిగిపోతుందని, తండ్రిని చూడగానే ఆటోమేటిక్ గా నవ్వుతుందని, తన ముఖంలో తెలియని ఏదో ఆనందం కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది ఉపాసన.

 

అలా వారిద్దరి మధ్య బాండింగ్ చూసినప్పుడు నాకు కొంచెం జలసీగా ఉంటుంది అని తెలిపింది ఉపాసన. ఈ సందర్భంగా ఉపాసన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో ఉపాసన కామెంట్స్ పై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. చరణ్ షూటింగ్స్ కు వెళ్లకపోవడానికి ఇదే కారణమన్నమాట క్లీంకార డాడీ లిటిల్ ప్రిన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కాగా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్లయిన తర్వాత దాదాపు 10 ఏళ్లకు క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత చెర్రీకి పిల్లలు కావడంతో మెగా ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నారి లిటిల్ ప్రిన్సెస్ క్లీంకార ఏ ముహూర్తాన మెగా ఇంట్లో అడుగుపెట్టిందో కానీ అప్పటినుంచి ప్రతి చిన్న సందర్భాన్ని ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా ఫ్యామిలీ.

  Last Updated: 07 Feb 2024, 07:40 AM IST