Upasana Konidela : సెకండ్ ప్రెగ్నెన్సీ ఫై ఉపాసన హింట్ …ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

అతి త్వరలో మెగా అభిమానులు మరో గుడ్ న్యూస్ వినబోతున్నట్లు తెలుస్తుంది. అదేంటి అంటే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రికాబోతున్నాడు. ఇది మీము చెప్పడం లేదు..స్వయంగా ఉపాసనే హింట్ ఇచ్చింది. అపోలో గ్రూప్ వైస్ చైర్ పర్సన్ ఓ పక్క , మెగా కోడలి గా మరో పక్క ఇలా రెండు పక్కల సమాజంలో ఓ హోదా ఉన్నప్పటికీ , అవేమి పట్టించుకోకుండా ఓ సామాన్య మహిళగా ఉండేందుకు ఉపాసన ఇష్టపడుతుంటుంది. […]

Published By: HashtagU Telugu Desk
ram charan and upasana

ram charan and upasana

అతి త్వరలో మెగా అభిమానులు మరో గుడ్ న్యూస్ వినబోతున్నట్లు తెలుస్తుంది. అదేంటి అంటే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రికాబోతున్నాడు. ఇది మీము చెప్పడం లేదు..స్వయంగా ఉపాసనే హింట్ ఇచ్చింది. అపోలో గ్రూప్ వైస్ చైర్ పర్సన్ ఓ పక్క , మెగా కోడలి గా మరో పక్క ఇలా రెండు పక్కల సమాజంలో ఓ హోదా ఉన్నప్పటికీ , అవేమి పట్టించుకోకుండా ఓ సామాన్య మహిళగా ఉండేందుకు ఉపాసన ఇష్టపడుతుంటుంది. యంగ్ ఎంట్రప్రెన్యూర్ , సామాజిక సేవకురాలు , న్యూట్రిషన్ ఎక్స్పర్ట్..ఇలా ఆమెలో చాల టాలెంట్ లు ఉన్నప్పటికీ , చాల సింపుల్ గా ఉండడం ఆమెకే చెల్లుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ ఏడాది జూన్ 20న ఉపాసన (Upasana ) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. క్లిన్ కార అనే పేరు ఆ పాప కు పెట్టడం జరిగింది. ఇక క్లీన్ కార ఫేస్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉపాసన రెండో ప్రెగ్నెన్సీ ఫై హింట్ ఇచ్చింది. తాజాగా ఓ కార్యక్రమానికి ఉపాసన హాజరైంది. ఈ కార్యక్రమంలో రెండో బిడ్డకు జన్మనిచ్చే ప్లాన్​పై , అలాగే మహిళల ఆరోగ్యం గురించి పలు విషయాలు షేర్ చేసింది. మహిళలు ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపింది. లైఫ్​లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది మహిళల నిర్ణయమని చెప్పిన ఉపాసన.. తాను పిల్లల్ని ఎందుకు ఆలస్యంగా కనాలనుకున్నాదో తెలిపింది. తన పక్కనున్న డాక్టర్​ కూడా ఆలస్యంగానే పిల్లల్ని కావాలని అనుకుందని చూపించింది. ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు తానేమీ బాధపడలేదని స్పష్టత ఇచ్చింది. ఫైనల్​గా తన సెకండ్‌ ప్రెగ్నెన్సీ గురింటి ప్రశ్న ఎదురవ్వగా మె హెల్త్ మై ఛాయిస్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ కామెంట్స్​ నెట్టింట్లో వైరల్‌ గా మారాయి. ఈ ఏడాది చివరిలోగా ఉపాసన మరో శుభవార్త చెబుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Read Also : Samantha : ఏంటి సామ్ ఏజ్ 23 ఏళ్లేనా..?

  Last Updated: 22 Feb 2024, 04:14 PM IST