Upasana Konidela: రూమర్స్ నమ్మకండి ప్లీజ్..!

గత కొన్నిరోజులుగా రాంచరణ్, ఉపాసనలపై పలు వార్తలొస్తున్నాయి.

Published By: HashtagU Telugu Desk
ram charan and upasana

ram charan and upasana

గత కొన్నిరోజులుగా రాంచరణ్, ఉపాసనలపై పలు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ఈ జంటకు పెళ్లై పదేళ్లు అయినా పిల్లలు లేకపోవడం పట్ల రకరకాల గాసిప్స్ వినిపించాయి. పిల్లలు కనడంపై ఈ జంట క్లారిటీ ఇచ్చినా రూమార్స్ మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఉపాసన సద్గురుతో ముచ్చటించిన విషయం తెలిసిందే. అందులో పిల్లల ప్రస్తావన వచ్చింది.  జనాభా నియంత్రణ ఆందోళనల కారణంగానే ఉపాసన పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు అనేక వార్తలొచ్చాయి.

అయితే అందులో నిజం లేదని, వీడియో మొత్తం చూడాలని క్లారిటీ ఇచ్చింది. ఉపాసన ఇన్ స్టా గ్రామ్ లో స్క్రీన్ షాట్ ను షేర్ చేసి.. “ఓహ్.. ఇది నిజం కాదు. దయచేసి మొత్తం వీడియోను వీక్షించండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రామ్ చరణ్, ఉపాసనల పెళ్లయి పదేళ్లైంది. జీవిత లక్ష్యాలు వేరు. ఇది వారి వ్యక్తిగత విషయమే అయినప్పటికీ, పిల్లలు పుట్టడంపై మీడియా పదే పదే ఆ దంపతులను ప్రశ్నించింది. ఈ విషయమై ఉపాసన పలు సందర్భాల్లో మాట్లాడింది. మేం ఇద్దరం నిర్ణయించుకున్నప్పడే పిల్లలు పుడతారని ఉపాసన స్పష్టం చేసింది.

  Last Updated: 15 Jul 2022, 05:58 PM IST