Site icon HashtagU Telugu

Thalapathy Vijay : విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఫై ఉపాసన ఇంట్రస్టింగ్ కామెంట్స్

Upasana Vijay

Upasana Vijay

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల కోలీవుడ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. చిత్రసీమ నుండి ఇప్పటికే ఎంతోమంది కళాకారులు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా , ఎంతో ఉన్నంత స్థాయికి చేరుకొని ప్రజలకు సేవ చేసారు. మరికొంతమంది మాత్రం రాజకీయాల్లో రాణించలేక వెనుతిరిగిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు తో పాటు పలు భాషల్లోని నటి నటులు రాజకీయాల్లో రాణిస్తుండగా..తాజాగా కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఫై ప్రతి ఒక్కరు స్పందిస్తూ వెల్ కం చెపుతున్నారు.

తాజాగా మెగా కోడలు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య..విజయ్ ఎంట్రీ ఫై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విజయ్ సినిమా రంగంలో గొప్పగా రాణించారు. ఇప్పుడు ప్రజల మనసులో స్థానం సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చారు. నా మామయ్య (చిరంజీవి), అంకుల్ (పవన్ కళ్యాణ్) కూడా రాజకీయాల్లో ప్రవేశించారు. చాలా మంది గొప్ప సీఎంలు సినిమా బ్యాండ్ ఉన్నవారే’ అని తెలుపుతూ విజయ్ అల్ ది బెస్ట్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

గత కొన్నేళ్లుగా విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు ‘విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవలే పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణల్లో మార్పు తీసుకురావడం కోసం రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించి “తమిళగ వెట్రి కజగం”(Tamizhaga Vetri Kazhagam)అనే పార్టీని అధికారికంగా ప్రకటించారు.

విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలియడంతో అభిమానులు ఓ పక్క ఆనందిస్తూనే, మరో పక్క సినిమాలకు దూరమవుతాడని బాధపడుతున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తుండటంతో సినిమాలు ఆపేస్తాడని కూడా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ తన 68వ సినిమాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే సినిమా చేస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా తర్వాత మరో సినిమా చేస్తాడని అంటున్నారు. RRR సినిమా తెరకెక్కించిన DVV ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి విజయ్ గతంలో ఓ సినిమా చేస్తానని చెప్పినట్ట్టు సమాచారం. ఈ సినిమానే విజయ్ లాస్ట్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమా కు భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడని కూడా అంటున్నారు. చూద్దాం మరి ఈ సినిమానే చివరిదా..లేక మరోటి చేస్తాడా..

Read Also : Paytm Vs Phonepe : ఫోన్‌ పే, భీమ్‌ యాప్‌‌లకు రెక్కలు.. పేటీఎం కొనుగోలుకు 2 కంపెనీల పోటీ