Site icon HashtagU Telugu

Upasana Baby Bump: రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో ఉపాసన బేబీ బంప్ లుక్.. ఫొటో వైరల్..!

Upasana

Resizeimagesize (1280 X 720)

మెగా కోడలు ఉపాసన గురించి తెలుగు వారికి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉపాసన (Upasana), రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సామాన్యులకు అండగా నిలుస్తున్నారు. అది అలా ఉంటే రామ్ చరణ్ సోమవారం తన 38వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్‌గా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్‌తో కనిపించింది.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఉపాసన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. భర్తకు బర్త్ డే విషేస్ తెలుపుతూ.. హ్యాపీ బర్త్ డే మై బెస్టీ అని రాసుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సోమవారం రాత్రి చిరంజీవి ఇంట్లో బర్త్ డే బాష్ జరిగింది. ఈ ఈవెంట్‌కు ఉపసాన రామ్ చరణ్‌లు ఫోజులిచ్చారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read: Hansika Motwani : సమ్మర్ వొకేషన్ ఎంజాయ్ చేస్తున్న హన్సిక మోత్వానీ

ఇక ఉపాసన బేబీ బంప్ కూడా ఈ ఫొటోల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలో గుడ్ న్యూస్ కూడా వినబోతున్నామని తెలిసి మెగా ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి రామ్ చరణ్ నుంచి పాజిటివ్ న్యూస్ వస్తుండేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇక రామ్ చరణ్ బర్త్ డే వేడుకలో డైరెక్టర్స్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ తోపాటు హీరోలు వెంకటేష్, అడివి శేష్, విజయ్ దేవరకొండ, రానాతో పాటు పలువురు సందడి చేశారు. అక్కినేని నాగార్జున, కాజల్ తదితరులు తమ తమ ఫ్యామిలీస్ తో కలిసి ఈ పార్టీలో పాల్గొన్నారు.

 

Exit mobile version