Athamma’s Kitchen : ఫుడ్ బిజినెస్ లోకి ఉపాసన..’అత్తమ్మ ‘ పేరుతో ప్రారంభం

  • Written By:
  • Publish Date - February 18, 2024 / 03:49 PM IST

మెగాస్టార్ చిరంజీవి కోడలు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన (Upasana)..ఇప్పుడు ఫుడ్ బిజినెస్ (Food Business) లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అంత ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అనేక వ్యాపారాలు సీజన్ బట్టి నడిస్తే ఫుడ్ బిజినెస్ మాత్రం సీజన్ లతో సంబంధం లేకుండా 24 * 7 నడుస్తూనే ఉంటుంది. అదికాక ఇప్పుడు జనాలంతా ఇంట్లో వంట చేసుకొని తినడం తగ్గించారు.

పెరుగుతున్న నిత్యావసర ధరలు , వంట చేసుకొని తినే టైం లేకపోవడం ఇలా పలు కారణాలతో అనేక మంది హోటల్స్ లలో , రోడ్ సైడ్ హోటల్స్ లలో , అలాగే ఆర్డర్లు పెట్టుకొని ఫుడ్ తింటూ టైం సేవ్ చేసుకుంటున్నారు. ఇలా రోజు రోజుకు ఫుడ్ బిజినెస్ కు ఆదరణ పెరుగుతుండడం తో అంత ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది డబ్బు సంపాదించడం కోసం ఈ బిజినెస్ లోకి దిగితే, మరికొంతమంది నాణ్యమైన ఫుడ్ అందించి పేరు తెచ్చుకోవాలని దిగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రామ్ చరణ్ వైఫ్ ఉపాసన సైతం చిరంజీవి భార్య సురేఖ బర్త్ డే సందర్భంగా ”అత్తమ్మ కిచెన్’ (Athamma’s Kitchen)’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘రెడీ టు ఈట్’ సౌతిండియా ఆహారాన్ని ఎంతో రుచిగా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి ఇంటిని గుర్తుచేసేలా ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తామన్నారు. ఈ ఫుడ్ కోసం (https://athammaskitchen.com/) అనే వెబ్ సైట్ ను అందుబాటులో తీసుకొచ్చారు.

ప్రస్తుతానికి ఉప్మా మిక్స్, పులిహోర పేస్ట్, పొంగల్ మిక్స్, రసం పౌడర్ నాలుగింటిని అమ్ముతున్నారు. ఈ నాలుగు కలిపి కొనాలనుకునే వారికి 1100 రూపాయలు ఛార్జ్ విధిస్తున్నారు. తన అత్తమ్మ పుట్టినరోజు నాడే ఈ కొత్త వెంచర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఉపాసన వెల్లడించారు. ముఖ్యంగా సొంత ఇంట్లో లేని వారు అంటే బ్యాచిలర్స్ లేదా సొంత ప్రాంతానికి దూరంగా ఉంటున్న వారు వీలైనంత త్వరగా సౌత్ ఇండియన్ డిషెస్ తయారు చేసుకునేందుకు ఈ వెంచర్ స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో మాత్రమే ఈ బిజినెస్ మొదలుపెట్టినా త్వరలోనే విదేశాల్లో ఉన్న తెలుగు వారు సౌత్ ఇండియన్ పీపుల్ కి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also : PhD At 89 Years : 89 ఏళ్ల ఏజ్‌లో పీహెచ్‌డీ.. పెద్దాయన కొత్త రికార్డు