Upasana: చిరు ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్.. నెట్టింట్లో ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఆ

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 05:50 PM IST

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఆ సమయం కోసం మెగా కుటుంబ సభ్యులు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొణిదెల,కామినేని కుటుంబాలు చెర్రీ, ఉపాసన లకు పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆనందాన్ని బంధువులు, సన్నిహితులతో పంచుకుంటూ పలు స్పెషల్‌ పార్టీలను ఇరు కుటుంబాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చిరంజీవి నివాసంలో ఉపాసనకు బేబీ షవర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

హైదరాబాద్‌ లోని చిరు ఇంట తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పార్టీలో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఉపాసనకు ఆమె సోదరీమణులు అనుష్పాల, సింధూరి దుబాయ్‌లో సీమంతం చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా చిరు ఇంట్లో బేబీ షవర్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఉపవాస తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన పుట్టబోయే బిడ్డ గురించి తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైద్యులు తనకు జులైలో డెలివరీ డేట్‌ ఇచ్చారని, ప్రతి క్షణం చరణ్‌ తనకెంతో సపోర్ట్‌ చేస్తున్నాడని అందరిలానే మేము కూడా పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాము చెప్పుకొచ్చింది ఉపాసన. ఒకవైపు పుట్టిన బిడ్డను చూసుకుంటూనే తన కెరీర్‌ పై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు తెలిపింది. రెండింటినీ బ్యాలెన్స్‌ చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది ఉపాసన.