Unstoppable : సీఎం చంద్రబాబుతో బాలయ్య.. బావతో అన్‌స్టాపబుల్ షూటింగ్ మొదలుపెట్టిన బాలకృష్ణ.. ఫొటోలు వైరల్..

ఇటీవలే అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో కూడా విడుదల చేసారు.

Published By: HashtagU Telugu Desk
Unstoppable with NBK Season 4 First Episode Shoot Happened with CM Chandrababu Naidu

Cm Chandrababu

Unstoppable : బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ గా ఆహా(Aha) ఓటీటీలో వచ్చిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా ఎంతోమంది హీరోలు, హీరోయిన్స్, సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వచ్చి సందడి చేసారు. అసలు బాలయ్య ఇలాంటి షో చేస్తాడని కూడా ఊహించలేదు ఎవ్వరూ. కానీ ఈ షోతో అందరూ బాలయ్యలో ఇంకో కోణం చూసి ఆశ్చర్యపోయారు.

ఇక ఈ అన్‌స్టాపబుల్ సీజన్ 4 కూడా మొదలుపెట్టారు. ఇటీవలే అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో కూడా విడుదల చేసారు. ఇందులో బాలయ్య సూపర్ హీరోలా యానిమేషన్ లో కనపడి మెప్పించారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ కూడా షూట్ అయ్యాయి. అయితే సీజన్ 4 లో మొదటి ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో(CM Chandrababu Naidu) మొదలుకానుంది. తాజాగా నేడు దీనికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

తన బావ సీఎం చంద్రబాబుతో బాలకృష్ణ నేడు అన్‌స్టాపబుల్ షూటింగ్ చేసారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్‌స్టాపబుల్ కి వచ్చి సందడి చేసారు. ఇప్పుడు మరోసారి ప్రభుత్వంలోకి వచ్చాక సీఎం హోదాలో అన్‌స్టాపబుల్ షోకి వస్తుండటంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు నెలకొన్నాయి. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ ఆహా ఓటీటీలో అక్టోబర్ 25 నుంచి టెలికాస్ట్ కానుంది.

 

Also Read : Chaitu-Shobitha : శోభితతో నాగచైతన్య.. పిక్ మాములుగా లేదు

  Last Updated: 20 Oct 2024, 04:02 PM IST