Unstoppable with NBK 3 : బాలయ్య అన్‌స్టాపబుల్ మళ్ళీ రాబోతుంది.. సీజన్ 3 షురూ..

అన్‌స్టాపబుల్ రెండు సీజన్లు 20 ఎపిసోడ్స్ తీయగా సూపర్ హిట్ గా నిలిచి ఈ షో సరికొత్త రికార్డులని సెట్ చేసింది. రెండు సీజన్లు హిట్ అవ్వడంతో సీజన్ 3 కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి.

Published By: HashtagU Telugu Desk
Unstoppable with NBK Season 3 will starts Soon in Aha OTT

Unstoppable with NBK Season 3 will starts Soon in Aha OTT

బాలకృష్ణ(Balakrishna) తనలోని కొత్త వేరియేషన్ ని చూపిస్తూ ఆహా ఓటీటీలో(Aha OTT) సరికొత్తగా యాంకర్ గా మారి అన్‌స్టాపబుల్ విత్ NBK(Unstoppable with NBK)అనే షో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అన్‌స్టాపబుల్ రెండు సీజన్లు 20 ఎపిసోడ్స్ తీయగా సూపర్ హిట్ గా నిలిచి ఈ షో సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఇప్పటివరకు టాక్ షోకి రాని స్టార్స్ ని కూడా తీసుకొచ్చి బాలకృష్ణ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.

అన్‌స్టాపబుల్ షోకి రెండు సీజన్లలో మోహన్ బాబు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్, గోపీచంద్.. ఇలా స్టార్ హీరోలతో పాటు హీరోయిన్స్, డైరెక్టర్స్, నిర్మాతలని కూడా తీసుకొచ్చి వాళ్ళని సరదాగా ఇంటర్వ్యూ చేసి బోలెడన్ని ఆసక్తికర విషయాలని చెప్పించి ప్రేక్షకులను, అభిమానులను ఫుల్ గా ఖుషి చేశారు బాలయ్య. ఈ షో రెండు సీజన్లు హిట్ అవ్వడంతో సీజన్ 3 కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి.

అయితే చంద్రబాబు అరెస్ట్, వచ్చే సంవత్సరం ఏపీ ఎలక్షన్స్ ఉండటం.. వీటన్నిటితో బాలయ్య బిజీగా ఉంటారు అన్‌స్టాపబుల్ సీజన్ 3 ఉండదేమో అనుకున్నారు కానీ అందరిని సర్ ప్రైజ్ చేస్తూ ఆహా ఓటీటీ అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 3 అనౌన్స్ చేసింది. తాజాగా దీనిపై ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ అన్‌స్టాపబుల్ సీజన్ 3 రాబోతుంది కానీ ఈ సారి లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే అని పోస్ట్ చేశారు. దీంతో ఈ సారి షో ఉన్నా తక్కువ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈసారి ఎలాగైనా మెగాస్టార్ చిరంజీవిని అన్‌స్టాపబుల్ షోకి తీసుకువస్తారని సమాచారం.

  Last Updated: 08 Oct 2023, 10:37 AM IST