Site icon HashtagU Telugu

Balakrishna Show: టాక్ షో కు బాలయ్య రెడీ.. త్వరలో ‘అన్‌స్టాపబుల్ విత్ NBK 2’

Balakrishna

Balakrishna

నందమూరి బాలకృష్ణ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. బాలకృష్ణ తన నాన్‌స్టాప్ ఎనర్జీతో ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సెలబ్రిటీ టాక్ షో చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ సీజన్ లెక్కకు మించి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక రెండో సీజన్‌కు బాలయ్యను హోస్ట్ చేయడం పట్ల బాలకృష్ణ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆర్గనైజర్స్ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK 2’ ప్రీమియర్‌ను ప్రకటించారు.

ఇంతకుముందు ఆహా ఇండియన్ ఐడల్‌పై కనిపించిన బాలకృష్ణ త్వరలో ఆహాలో ఆకట్టుకోబోతున్నారు. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో సీజన్ 1లో మహేష్ బాబు, అల్లు అర్జున్, మోహన్ బాబు, రవితేజ, నాని, రానా దగ్గుబాటి వంటి ప్రముఖులు సందడి చేసి ఫుల్ ఎంటర్ టైన్ చేశారు. దీంతో బాలయ్య టాక్ షో ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లందరినీ ఆకట్టుకుంది. త్వరలోనే బాలయ్య టాక్ షో ప్రారంభం కాబోతుండటంతో మరోసారి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్-2 ఎలా ఉండబోతోంది? ఎవరెవరు గెస్ట్ లా వస్తారు? అంటూ ఆసక్తితో ఉన్నారు.