Site icon HashtagU Telugu

Rajinikanth: ఎప్పుడైనా మీరు రజనీకాంత్ తండ్రిని చూశారా.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోస్?

Mixcollage 06 Feb 2024 12 01 Pm 7293

Mixcollage 06 Feb 2024 12 01 Pm 7293

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న రజనీకాంత్ ఇప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు రజినీకాంత్. ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో ఇప్పుడు అదే ఊపుతూ మరిన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. 73 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న లాల్ సాలమ్ సినిమాలో అదితి పాత్రలో కనిపించనున్నారు రజినీ.

ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్. ఇకపోతే రజినీకాంత్ గారు తెరపై ఎలా ఉంటారో, తెర వెనుక ఎలా ఉంటారో మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైనా రజనీకాంత్ తండ్రిని చూశారా. మనలో చాలా తక్కువ మంది మాత్రమే రజినీకాంత్ తండ్రి ఫోటో ని చూసి ఉంటారు. ఇక రజనీకాంత్ తండ్రికి సంబంధించిన రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అందులో రజినీ తన తండ్రితో కూర్చుని మాట్లాడుతున్నారు.

Rajinikanth Father

సాధారణంగా రజినీ తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా జనాలకు తెలియదు. ఆయన తండ్రి పేరు రామోజీ రావు.. గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజినీ బెంగుళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు రజినీ. సినిమాల్లోకి అడుగుపెట్టకముందు రజినీ బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే రజినీ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో ఇప్పటివరకు ఎక్కడ బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం తన తండ్రితో కలిసి కూర్చుని సూపర్ స్టార్ ముచ్చటిస్తున్న ఫోటో మాత్రం అందరిని ఆకట్టుకుంటోంది.