Site icon HashtagU Telugu

Nag Beats Chiru: చిరుపై నాగ్ ఆధిపత్యం.. గాడ్ ఫాదర్ కంటే ‘ఘోస్ట్’ కే హైప్!

Tollywood

Tollywood

బ్రహ్మాస్త్ర మూవీలో నందియాస్త్రగా నాగార్జున నటన విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మొదట్లో ప్రేక్షకుల్లో తక్కువ బజ్ ఉంది. కానీ దాని థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషనల్ ట్రైలర్‌ స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ వచ్చింది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ కూడా అదే తేదీన ఘోస్ట్ (అక్టోబర్ 5 న) విడుదలవుతోంది. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి సినిమా కంటే నాగ్ సినిమాపై ఎక్కువ అంచనాలు ఉండటం ఇదే మొదటిసారి. గాడ్‌ఫాదర్ టీం పేలవమైన ప్రమోషన్‌లు కూడా ఇందుకు ఓ కారణం.

అక్కినేని అభిమానులకు మరో శుభవార్త. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియా డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రముఖ గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ యజమాని మనీష్ షా హిందీ డబ్బింగ్ వెర్షన్ హక్కులను పొందేందుకు ది ఘోస్ట్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నారు. ది ఘోస్ట్ మూవీని హిందీ వెర్షన్‌ను తెలుగుతో పాటు ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నాడు. అన్నీ కుదిరితే, ఘోస్ట్ హిందీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మొదటి రోజు టాక్ అద్భుతంగా ఉంటే ఉత్తరాదిలో మినీ పుష్పగా అవతరించే అవకాశం ఉందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

Exit mobile version