Rashmika Mandanna: ప్రస్తుతం నడుస్తున్న కాలం అంతా ట్రెండింగ్. ఎవరైనా ఎలాగోలా పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. కొందరు మెుత్తం బట్టలుప్పి బయట తిరుగుతుంటే, మరికొందరు చెత్త కామెంట్లు, పోస్టుల ద్వారా తమని తాము పాపులర్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కానీ దేనికైనా ఓ హద్దు ఉంటుందని మరిచిపోతూ ఉంటారు. ఆ హద్దులు మీరితే, సమాజం కూడా యాక్సెప్ట్ చేయదనే విషయాన్ని మరుస్తారు. ఇలానే ఓ వ్యక్తి మరిచారు. ఈయన వ్యక్తి కాదు, ఏదో శక్తిలా ఫీల్ అవుతూ ఉంటారు.
ఈ ఎక్ట్సా యాక్టివిస్ట్ వేరు ఉమైర్ సంధు. ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని బయట చెప్పుకుంటూ ఉంటారు. అయితే వాస్తవంగా ఆ పోస్టులో ఉన్నారో లేదో తెలియదు మరి. బాలీవుడ్ అడల్ట్ గాసిప్స్ అని అతను పెట్టుకున్నా బయో చూస్తే చాలు ఆ అకౌంట్ లో ఎలాంటి ట్వీట్స్ వస్తాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇతను దళపతి విజయ్ నుంచి మన విజయ్ దేవరకొండ వరకూ ప్రతి ఒక్కరికీ ఇల్లీగల్ అఫైర్ అంటగట్టగలడు. ఇలా చేయటం చాలా ఈజీ. కానీ అది తమ మనసుకు ఒప్పుతుందా అన్న విషయం మాత్రం ఆలోచించరు. విజయ్,కీర్తి సురేష్ ని డేటింగ్ చేస్తున్నాడు.నాని దసరా సినిమా షూటింగ్ సమయంలో కీర్తి సురేష్ ని లవ్ చేశాడనే గాసిప్ ని క్రియేట్ చేశాడు.
రామ్ చరణ్-ప్రియాంక చోప్రా కలిసి హోటల్ లో టైం స్పెండ్ చేశారు, సూర్య -దిశా పటాని ముంబైలో కలిసి ఉంటున్నారు, అజయ్ దేవగన్-కం గనా షూటింగ్ సమయంలో ఇలా ఇష్టం వచ్చినవన్నీ పెడుతూ ఉంటారు. కానీ అందులో ఒకటీ నిజం ఉండదు.
అయితే ఇవన్నీ అతను ఉన్నాడని చెప్పుకునేందుకే పెడుతున్నాడని కొందరు అంటూ ఉంటారు. కామెంట్స్ ఈ పోస్టులపై ఘోరంగా తిడుతూ ఉంటారు. కానీ ఆయన ఎక్కడా తగ్గడు. తాజాగా అల్లు అర్జున్-రష్మి క ప్రైవేటు ప్లేన్ లో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బన్నె వైఫ్ కి ఈ విషయం తెలిసినా ఆమె దీన్ని పట్టించుకోలేదని ట్వీట్ చేస్తూ ఉమైర్ సంధు ఒక ఫోటో కూడా రిలీజ్ చేశాడు.
కానీ దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పోస్టులు పెట్టడానికి సిగ్గుగా లేదా అని విమర్శలు గుప్పిస్తున్నారు. సిగ్గుండాలని కదా అని ప్రశ్నిస్తున్నారు. బన్నీ ఫ్యాన్సు అయితే ఓ ఆట ఆడేసుకుంటున్నారు.