Site icon HashtagU Telugu

Ram Charan: ఉక్రెయిన్ బాడీగార్డుకి ‘రాంచరణ్’ సాయం!

Ram Charan

Ram Charan

రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. యుద్ధ సన్నివేశాలు, భారీ యాక్షన్ సీన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం ఇతర దేశాల్లో సైతం షూటింగ్ జరుపుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లోనూ కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కించారు. RRR ఉక్రెయిన్ షెడ్యూల్ సమయంలో రామ్ చరణ్‌కు ఉక్రేనియన్ అయిన రస్టీ (బాడీగార్డు) సెక్యూరిటీ బాధ్యతలను చూసుకున్నారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ పై ముప్పేట దాడి చేస్తుండటంతో రష్టీ క్షేమం గురించి రామ్ చరణ్ ఆందోళన చెందుతున్నాడు.

షూటింగ్ సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి కోసం రామ్ చరణ్ మందులు, కొంత మొత్తంలో డబ్బు, ఇతర నిత్యావసరాలను పంపాడు. చరణ్ ప్రేమకు ఫిదా అయిన రస్టీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. “రామ్ చరణ్ తన సినిమా షూటింగ్ కోసం ఉక్రెయిన్ వచ్చాడు. అతను ఇక్కడ ఉన్న సమయంలో సెక్యూరిటీ కోసం బాడీగార్డ్‌గా పనిచేశాను. యుద్ధం ప్రారంభమైన వెంటనే చరణ్ ఫోన్ చేశాడు. నా భార్య అనారోగ్యం, మందులు లేకపోవడం గురించి తెలిపాను” అని అన్నాడు. చరణ్ సాయానికి థ్యాంక్స్ చెబుతూ.. యుద్ధం త్వరలో ముగియాలని ఆశిస్తున్నట్లు రస్టీ ఈ సందర్భంగా చెప్పాడు.