Site icon HashtagU Telugu

Vijay Devarakonda Family Star : ఫ్యామిలీ స్టార్ కి కలిసి వచ్చిన ఉగాది.. రాజు గారు చెప్పింది ఇదే కదా..!

Family Star

Family Star

Vijay Devarakonda Family Star విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం డైరెక్షన్ లో వచ్చిన సినిమా ది ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. సమ్మర్ హాలీడేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. అయితే ఫస్ట్ షోతోనే సినిమా రిజల్ట్ తెలిసిపోయినా నిర్మాత దిల్ రాజు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయనే స్వయంగా మైక్ తీసుకుని ఆడియన్స్ ని రివ్యూస్ అడిగారు.

ఒక సినిమా నిర్మాతగా కేవలం డబ్బులు పెట్టి వెళ్లిపోవడం కాకుండా సినిమాను నిలబెట్టేందుకు ఎలాంటి స్టెప్ అయినా తీసుకోవాలని దిల్ రాజుని చూస్తే అర్ధమవుతుంది. ఆ టైం లోనే ఉగాది, రంజాన్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా ఆ హాలీడేస్ కల్లా సినిమా ఆడియన్స్ ని రప్పిస్తుందని అంచనా వేశారు. ఆయన అన్నట్టుగానే ఉగాదికి వేరే సినిమాలేవి లేకపోవడంతో ఫ్యామిలీ స్టార్ చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపించారు

ఫస్ట్ డే తర్వాత ఫ్యామిలీ స్టార్ కు ఉగాది రోజు ఆక్యుపెన్సీ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. ఉగాది వల్ల ఫ్యామిలీ స్టార్ కు పుష్ ఏర్పడింది. ఇక మరోపక్క ఒకరోజు ఆగితే రంజాన్ కూడా ఉంది కాబట్టి సినిమా ఇంకాస్త రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. విజయ్ దేవరకొన సినిమా హిట్ అయితే ఏమో కానీ ఫ్లాప్ అయితే మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ ఏర్పడుతుంది.

దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. తమ హీరోపై జరుగుతున్న ఈ కుట్ర ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఐతే సినిమా బాగుంటే ఎవరు ఏమన్నా ఆడియన్స్ పట్టించుకోరు కానీ సినిమా కాస్త తేడా కొట్టేస్తే మాత్రం ఇలా సోషల్ మీడియా ట్రోల్స్ కు స్పేస్ దొరికినట్టు అవుతుంది. ఫ్యామిలీ స్టార్ కి కలిసి వచ్చిన ఉగాది వల్ల ఎంత వసూళ్లు రాబట్టాడు అన్నది తెలియాల్సి ఉంది. రంజాన్ రోజు కూడా ఇలానే ఫ్యామిలీ స్టార్ థియేటర్ లు నిండితే రాజు గారి చెప్పిన మాట నిజం అవుతుందని చెప్పొచ్చు.

Also Read : Niharika Konidela: నిహారిక సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’, సుప్రీం హీరో చేతుల మీదుగా టైటిల్ పోస్టర్