Site icon HashtagU Telugu

Bellamkonda: బెల్లంకొండపై యాక్షన్ సీన్స్.. రాజస్థాన్ లో ‘టైసన్ నాయుడు’ సందడి

Bellamkonda Sreenivas

Bellamkonda Sreenivas

Bellamkonda: బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న విలక్షణమైన యాక్షన్ ఎంటర్ టైనర్ టైసన్ నాయుడు. బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు రాజస్థాన్ లో రెండు వారాల పాటు జరిగే షెడ్యూల్ ను ప్రారంభించారు మేకర్స్. సినిమాకు హైలైట్ గా నిలిచే అద్భుతమైన యాక్షన్ బ్లాక్ ను చిత్రబృందం చిత్రీకరిస్తోంది. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటల్లో 10 రాత్రులు షూటింగ్ జరగనుంది.

రెండు వారాల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కొన్ని టాకీ పార్ట్ ను కూడా షూట్ చేయనున్నారు మేకర్స్. ఈ సబ్జెక్ట్ పై టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్లింప్స్ లో చూపించినట్లుగా ఈ సినిమాలో బెల్లంకొండ మాస్ అండ్ బల్క్ లుక్ లో కనిపిస్తున్నాడు. సాగర్ కె చంద్ర మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్డ్ క్యారెక్టర్ లో పోలీస్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.