Site icon HashtagU Telugu

Vijay Sethupati : విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. ఆస్తుల చిట్టా తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

Typical Actor Vijay Sethupathi.. If You Know The List Of Assets, You Will Be Surprised!

Typical Actor Vijay Sethupathi.. If You Know The List Of Assets, You Will Be Surprised!

Vijay Sethupati : విజయ్ సేతుపతి (Vijay Sethupati) పేరు ఇప్పుడు ఒక బ్రాండ్ గా మారిపోయింది. విలక్షణమైన ఒక క్యారెక్టర్ ఏదైనా ఉందంటే ఏ భాష వాళ్ళైనా సరే ముందుగా ఈ నటుడి వైపు చూస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బిజిఎస్ట్ సౌత్ యాక్టర్స్ లో ఈయన కూడా ఒకరు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన విజయ్ సేతుపతి (Vijay Sethupati) ఇప్పుడు తన టాలెంట్ తో తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

హీరో గానే కాకుండా, విలన్ గా క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి వరస సినిమాలు చేస్తూ భారీగా ఆస్తిపాస్తులు సంపాదించాడు. ఇటీవల ఒక సంస్థ అతని ఆస్తుల చిట్టా బయటపెట్టింది. విజయ్ కి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకొని ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్, ఖరీదైన బంగ్లాలు లగ్జరీ కార్లు ఇలా చాలానే ఉన్నాయి.

కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి ఒక్కొక్క సినిమాకి 15 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. గత ఏడాది షారుక్ ఖాన్ తో నటించిన సినిమా జవాన్ లో నటించినందుకు గాను 21 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. బాలీవుడ్లో ఇది విజయ్ సేతుపతికి మొదటి సినిమా. మొదటి సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఏదైనా బ్రాండ్ ని ప్రమోట్ చేయాలంటే 50 లక్షలు చార్జి చేస్తున్నాడు. చెన్నైలో అతను ఉంటున్న ఇంటి విలువ 50 కోట్లు.

ఇంకా విజయసేతుపతి రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భారీగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈయన దగ్గర కాస్ట్లీ కార్లు, ఇండియాలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అయినా షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ల దగ్గర ఉండే లగ్జరీ కార్లు ఉండటం విశేషం. మొత్తానికి ఈయన ఆస్తులు అన్ని కలుపుకుంటే నికరంగా 140 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇక ఇతను లేటెస్ట్ గా నటించిన సినిమా మేరీ క్రిస్మస్.జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

Also Read:  Mega Daughter Niharika : రెండో పెళ్లిపై మెగా డాటర్ ఘాటు కామెంట్స్.. నాకు ఇది గుణపాఠం అంటూ?