మలయాళంలో ఈమధ్య వరుస సినిమాలతో దూసుకెల్తున్న ఇద్దరు భామలు అనస్వర రాజన్ (Anaswara Rajan), మమితా బైజు. ఈ ఇద్దరు సినిమాలో ఉంటే దాదాపు సూపర్ హిట్ అన్నట్టే అన్న టాక్ కూడా వచ్చింది. అనస్వర రాజన్ ఇంకా సౌత్ లో పాపులర్ కాలేదు. ఆమె కేవలం మలయాళ సినిమాలే చేస్తూ వస్తుంది. కానీ తన క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక మరోపక్క మమితా బైజు (Mamitha Baiju) అయితే ప్రేమలు సినిమాతో అదరగొట్టేసింది. ప్రేమలు సినిమాతో అటు మలయాళంలోనే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసింది అమ్మడు.
మలయాళంలో ఈ ఇద్దరు ఇప్పుడు వరుస ఆఫర్లతో అదరగొట్టెస్తున్నారు. ఐతే ఇదే టైం లో వీరికి అనుకోని సమస్య ఒకటి వచ్చి పడింది. అదేంటి ఫాం లో ఉన్న హీరోయిన్స్ కు సమస్య ఏంటి అనుకోవచ్చు. వీళ్లిద్దరు టీనేజ్ బ్యూటీస్ లా కనిపిస్తారు. కానీ మలయాళంలో ప్రేమ కథలు తక్కువ మిగతా స్టోరీస్ ఎక్కువ చేస్తారు. అలాంటి టైం లో వీరిద్దరు మిడిల్ ఏజ్ హీరోలతో కలిసి నటించాలని అనుకున్నా కూడా చాలా ఏజ్ గ్యాప్ వస్తుంది.
Also Read : Rashmika : విజయ్ దేవరకొండ పోస్టర్ పై రష్మిక ఫైర్..!
ఈ ఏజ్ గ్యాప్ వల్ల స్క్రీన్ మీద వీరు తేలిపోతున్నారు. హీరో హీరోయిన్ మధ్య కనిపిచేలా ఏజ్ గ్యాప్ ఉంటే మాత్రం ఆ జోడీ ఆసక్తికరంగా అనిపించదు. మరి ముఖ్యంగా ఈ ఇద్దరికే ఇలాంటి సమస్య వస్తుందా లేదా మరి కొంతమందికి అయినా ఉందా తెలియదు కానీ అనస్వర రాజన్, మమితా బైజులకు మాత్రం ఈ సమస్య వెంటాడుతుంది.
అనస్వర రాజన్ కన్నా ముందే ప్రేమలు బ్యూటీ మమితా బైజు తెలుగు ఎంట్రీ ఇచ్చేలా ఉంది. ఈ ఇద్దరు తెలుగు లో సినిమాలు చేస్తే మాత్రం కచ్చితంగా ఇద్దరికి మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రేమలు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మమితా బైజుకి ఆల్రెడీ తెలుగు ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.