Site icon HashtagU Telugu

Hanuman Pre Release Event : హనుమాన్ కోసం ఆ ఇద్దరు స్టార్స్..!

Teja Sajja Prashanth Varma Hanuman Record TRP on Small Screen

Teja Sajja Prashanth Varma Hanuman Record TRP on Small Screen

Hanuman Pre Release Event ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా హనుమాన్. ఇండియన్ సూపర్ హీరో మూవీగా భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. జనవరి 12న సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం వస్తుండగా ఆ సినిమాకు పోటీగా హనుమాన్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో చిరు కనిపిస్తారని ఇప్పటికే ఒక న్యూస్ వైరల్ అయ్యింది. హనుమాన్ లో చిరు ఉండటం కన్ఫర్మ్ అయితే సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు మేకర్స్. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ని తీసుకొస్తున్నారని తెలుస్తుంది. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్, బాలకృష్ణ ఇద్దరు వస్తారని టాక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పాటుగా బాలయ్య బాబు కూడా హనుమాన్ ఈవెంట్ కి వస్తారని తెలుస్తుంది. ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్ టైం లో ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఆ సినిమా ఈవెంట్ సక్సెస్ అయ్యేలా చేసింది.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోమోస్ డైరెక్ట్ చేసింది ప్రశాంత్ వర్మనే. అందుకే ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ కు వీరిద్దరి సపోర్ట్ నిలుస్తున్నారని తెలుస్తుంది. సంక్రాంతికి స్టార్ సినిమాలు ఎన్నొచ్చినా హనుమాన్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. మరి హనుమాన్ ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.