Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. లవ్ స్టోరీల్లో ఓ కొత్త పంథాను తీసుకొచ్చింది ఆ సినిమా. మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు అర్జున్ రెడ్డి. అయితే ఈ సినిమా ముందు ఇద్దరు హీరోలు చేస్తామని తమ వెనక ఓ ఐదేళ్లు సందీప్ రెడ్డిని తిప్పించుకొని మోసం చేసారని రచయిత కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్టార్ రైటర్ కోన్ వెంకట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సందీప్ అర్జున్ రెడ్డి సినిమా గురించి చాలా ఆశయాలు నాతో పంచుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కించడానికి ఓ హీరోకి చెప్తే చేద్దాం అని మూడేళ్లు తన వెనకాల తిప్పించుకున్నాడు. రోజు ఆఫీస్ కి వెళ్లి తిని కథ డెవలప్ చేసుకోవడం పని. డబ్బులు ఇవ్వకపోయినా తన కథ బయటకి వస్తుందని తిరిగాడు. కానీ ఓ రోజు ఆ హీరో ఇండైరెక్ట్ గా సినిమా చేయనని చెప్పేసాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో హీరో దగ్గర ఇలాగే రెండు ఏళ్ళు తిరిగాడు. ఆ హీరో కూడా చేస్తానని చివర్లో హైన్డ్ ఇచ్చాడు అని తెలిపారు.
ఇలా అయిదేళ్ళు ఇద్దరు హీరోల వెనక తిరిగి మోసపోయాక సందీప్ బాధ చూడలేక వాళ్ళ అన్న నిర్మాతగా మారడంతో విజయ్ దేవరకొండను పెట్టి అర్జున్ రెడ్డి తీసి పెద్ద హిట్ కొట్టాడు అని తెలిపారు కోనవెంకట్. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మరి సందీప్ ని మోసం చేసిన ఆ ఇద్దరు హీరోలు ఎవరో మాత్రం చెప్పలేదు.
Also Read : Krithi Shetty : టాలీవుడ్ లో మిస్ అయినా తమిళ్, మలయాళంలో బిజీ అవుతుందిగా..