Prabhas Kalki : కల్కిలో ఆ ఇద్దరు హీరోయిన్స్.. వారెవా అనిపించేలా నాగ్ అశ్విన్ ప్లాన్..!

Prabhas Kalki నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుండగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్

  • Written By:
  • Publish Date - June 3, 2024 / 11:40 PM IST

Prabhas Kalki నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమా కల్కి ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ అవుతుండగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే కల్కి నుంచి బుజ్జిని పరిచయం చేసిన నాగ్ అశ్విన్ సినిమాకు ముందే ప్రీల్యూడ్ ని వదిలి అంచనాలు పెంచారు. మరోపక్క సినిమా నుంచి సరికొత్త అప్డేట్స్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి.

కల్కి సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఫీమేల్ లీడ్స్ గా దీపిక పదుకొనే నటిస్తుంది. దిశా పటాని కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. అయితే వీళ్లే కాదు సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తారని టాక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం కల్కి లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా క్యామియో రోల్ చేసిందని తెలుస్తుంది.

అంతేకాదు సీనియర్ హీరోయిన్ శోభన కూడా కల్కిలో భాగం అయ్యారని తెలుస్తుంది. సినిమాలో ప్రతి పాత్ర వారి ఇంట్రడక్షన్ తో సర్ ప్రైజ్ చేస్తారని అంటున్నారు. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ కల్కితో చాలా పెద్ద ప్లానింగే వేశాడని అర్ధమవుతుంది. కల్కి 2898 ఏడి సినిమా కల్కి సినిమాటిక్ యూనివర్స్ గా చాలా సీక్వెల్స్ ప్లానింగ్ లో ఉన్నాడు నాగ్ అశ్విన్.