Site icon HashtagU Telugu

Anil Ravipudi: అయ్యో.. అనిల్ రావిపూడి!

Anil Ravipudi1

Anil Ravipudi1

దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి మూడు సినిమాల్లో నటించింది హీరోయిన్ మెహ్రీన్‌. ఆయనతో మంచి స్నేహభావం కూడా ఉంది. ఈ హనీ బ్యూటీ కూడా అనిల్ పై గుర్రుగా ఉందట. “ఎఫ్ 3” లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదట. ఇద్దరు హీరోయిన్లలో తమన్నాకు బెస్ట్ రోల్ వచ్చింది. ఈ సినిమా మెహ్రీన్‌కి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. దీంతో అనిల్ తో క్లాషెస్ వచ్చినట్టు టాక్. వాళ్లిద్దరు మాట్లాడుకోవడం లేదని సమాచారం కూడా. తమన్నాకి మంచి పాత్ర ఇచ్చినప్పటికీ, ఆమె ప్రమోషన్స్‌కు హాజరు కాలేదు. అనిల్ రావిపూడికి ఆమెతో కూడా గ్యాప్ ఉంది. అటు తమన్నా, ఇటు మెహ్రీన్ ఇద్దరూ అనిల్ తో విభేదించినట్లు తెలుస్తోంది. ఎఫ్ 3 సినిమాల ప్రమోషన్లకు తమన్నా అటెండ్ అవుతుందని అనిల్ చెప్పినా.. తమన్నా మాత్రం దూరంగానే ఉంది.