Vijay Devarakonda విజయ్ దేవరకొండ ఈమధ్యనే తన బర్త్ డే నాడు నెక్స్ట్ చేయబోయే రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ గౌతం తిన్ననూరితో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుండగా రాజా వారు రాణి గారు డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఒక ప్రాజెక్ట్.. శ్యాం సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో మరో ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ముఖ్యంగా రాహుల్ తో విజయ్ చేసే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారు. కచ్చితంగా విజయ్ దేవరకొండ రేంజ్ పెంచే సినిమాగా ఇది అవుతుందని అంటున్నారు. అయితే విజయ్ రాహుల్ కాంబో సినిమాపై ఒక న్యూస్ వైరల్ గా మారింది. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాను విజయ్ కోసం రాయలేదని ఇద్దరు హీరోలకు చెబితే వారు కాదనడం వల్ల ఆ ఛాన్స్ వచ్చిందట.
ఇంతకీ రాహుల్ ఈ కథను ఎవరెవరిక్ చెప్పాడు అంటే కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి ఇద్దరికి అని తెలుస్తుంది. ముందు సూర్యకు కథ చెప్పగా స్టోరీ మెచ్చినా డేట్స్ ఇవ్వలేనని అన్నాడట. ఇదే కథ కార్తికి చెబితే తనకు బాగోదని అనేశాడట. అలా ఆ ఇద్దరు హీరోలు కాదన్న తర్వాత విజయ్ తో రాహుల్ సినిమా లాక్ చేసుకున్నాడు.
అయితే రాహుల్ తొలి సినిమా టాక్సీవాలా సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా చేశాడు. ఆ సినిమా హిట్ తర్వాత విజయ్ మరో హిట్ కొట్టలేదు. రాహుల్ సంకృత్యన్ తర్వాత నానితో శ్యాం సింగ రాయ్ చేసి సూపర్ హిట్ కొట్టాడు.
Also Read : Surya Karthik Subbaraju : సూర్య సినిమాకు దసరా కంపోజర్.. కార్తీక్ సుబ్బరాజు సూపర్ ప్లానింగ్..!