Site icon HashtagU Telugu

Kottha Bangarulokam : కొత్త బంగారు లోకం.. ఆ ఇద్దరు హీరోలు కాదన్నారా..?

Two Heroes Rejected Kottha Bangarulokam Movie

Two Heroes Rejected Kottha Bangarulokam Movie

Kottha Bangarulokam వరుణ్ సందేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కొత్త బంగారు లోకం. వరుణ్ సందేష్, శ్వేతా బసు ప్రసాద్ కలిసి నటించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో హీరోగా ముందు వరుణ్ సందేష్ ని అనుకోలేదట. అప్పటికే అక్కినేని నాగార్జున వారసుడు నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలిసి నాగ చైతన్య కోసం ఈ కథ చెప్పాడట శ్రీకాంత్ అడ్డాల.

అయితే చైతన్యకు మాస్ ఇమేజ్ ఉన్న కథ కావాలని. లవ్ స్టోరీ వల్ల సాఫ్ట్ ఇమేజ్ వస్తుందని భావించి ఆ ఆఫర్ కాదనుకున్నారట. ఇక నాగ చైతన్య తర్వాత అప్పటికే హీరోగా సక్సెస్ అయిన రామ్ దగ్గరకు కూడా ఈ కథ తీసుకెళ్లారట. అయితే కాలేజ్ లవర్ బోయ్ గా తను కష్టమని భావించి రాం వద్దన్నాడట.

అలా వాళ్లిద్దరు కాదనడం తో వరుణ్ సందేష్ చేశాడు. ఆ సినిమా హిట్ తో వరుణ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ ఇమేజ్ ని వరుణ్ కాపాడుకోలేకపోయాడు. కొత్త బంగారు లోకం సినిమాలో వరుణ్ సందేష్ కాకుండా రామ్, నాగ చైతన్య అయితే ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి.

Also Read : Indraganti Mohanakrishna Priyadarshi : అభిరుచిగల దర్శకుడు.. ప్రతిభగల హీరో.. కాంబో సెట్ అయ్యింది..!