Manipur A Hindi Film : 20 ఏళ్ల తర్వాత మణిపూర్‌లో హిందీ మూవీ.. ఆ ఉగ్ర సంస్థ ఊరుకుంటుందా ?

Manipur A Hindi Film : మణిపూర్ అనగానే .. ఇప్పుడు మనకు గుర్తుకొచ్చేవి హత్యలు, అత్యాచారాలు, దాడులు, తుపాకీ కాల్పుల మోతలు, గృహ దహనాలు, దోపిడీలు!! ఇంకా ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణమే ఏర్పడలేదు..

Published By: HashtagU Telugu Desk
Manipur A Hindi Film

Manipur A Hindi Film

Manipur A Hindi Film : మణిపూర్ అనగానే .. ఇప్పుడు మనకు గుర్తుకొచ్చేవి హత్యలు, అత్యాచారాలు, దాడులు, తుపాకీ కాల్పుల మోతలు, గృహ దహనాలు, దోపిడీలు!! ఇంకా ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణమే ఏర్పడలేదు.. ఇటువంటి తరుణంలో ఓ వార్త తెరపైకి వచ్చింది.  మణిపూర్ లోని చురాచాంద్‌పుర్‌ జిల్లాలోని రేంగ్‌కయ్‌ ప్రాంతంలో హిందీ సినిమా ప్రదర్శిస్తామని గిరిజన సంస్థ హమర్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (HSA) వెల్లడించింది.అయితే, ఏ సినిమాను  ప్రదర్శిస్తారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

Also read : Rejected 13 Job Offers : ఆమె 13 జాబ్ ఆఫర్స్ కు నో చెప్పింది.. ఆ తర్వాత ఏమైందంటే ?

అయితే మణిపూర్ లో హిందీ సినిమాలను నిషేధిస్తున్నట్లు అక్కడి రెవల్యూషనరి పీపుల్స్‌ ఫ్రంట్‌ (RPF) 2000 సెప్టెంబర్‌ లో ప్రకటించింది. అంతటితో  ఊరుకోకుండా అప్పట్లో వివిధ స్టోర్‌లలో ఉన్న సుమారు 8వేల హిందీ సినిమాల సీడీలు, క్యాసెట్లను తగులబెట్టింది. అప్పటి నుంచి మణిపూర్ లోని అనేక జిల్లాల్లో ఒక్క హిందీ సినిమా(Manipur A Hindi Film) కూడా ప్రదర్శించలేదు. 1998లో ప్రదర్శించిన “కుచ్‌ కుచ్‌ హోతా హై” మూవీ చివరిది. ఇటీవల వచ్చిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘రాకెట్రీ’ సినిమాలను రాష్ట్ర  రాజధాని ఇంఫాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అయితే కొంతమంది ప్రేక్షకులే హాజరయ్యారు.  ఈనేపథ్యంలో ఇప్పుడు HSA సంస్థ ఆధ్వర్యంలో హిందీ సినిమాను ప్రదర్శిస్తే.. రెవల్యూషనరి పీపుల్స్‌ ఫ్రంట్‌  ఊరుకుంటుందా ? ఒకవేళ రెవల్యూషనరి పీపుల్స్‌ ఫ్రంట్‌  దాడికి తెగబడితే .. ఇప్పటికే హింసతో అట్టుడుకుతున్న మణిపూర్  మరింత రక్తపాతాన్ని చూడాల్సి వస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి.

Also read : Rains: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

  Last Updated: 15 Aug 2023, 06:16 PM IST