Site icon HashtagU Telugu

Bunny & Charan War: బన్నీ, చరణ్ అభిమానుల ‘ట్వీట్’ వార్

Charan And Bunny

Charan And Bunny

నందమూరి అభిమానులు, మెగా అభిమానులు పరస్పరం పోట్లాడుకోవడం మనం చూశాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ కూడా జరిగింది. మహేష్ బాబు, రామ్ చరణ్ అభిమానులు కూడా ఆన్‌లైన్‌ లో ఫైట్ చేశారు. కానీ విచిత్రమేమిటంటే.. అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్‌ల యుద్ధం చేయడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అల్లు అర్జున్, రామ్ చరణ్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు సోమవారం నుంచి ట్రెండింగ్‌లో ఉన్నాయి.

నేటికీ ఆ ట్వీట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అశ్లీలమైన మీమ్స్‌ని ఇరు పక్షాలు  అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య చాలా కాలంగా గ్యాప్ ఉంది. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ వార్ మరో మలుపు తిరిగింది. ఇక అల్లు అర్జున్ “పుష్ప 2” లో నటించేందుకు రెడీ ఉండగా, రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వారి సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. బాక్సాఫీస్ వద్ద పోటీ పడలేదు. అయినా ఈ అభిమానులు ట్వీట్ వార్‌కు దిగడం హాట్ టాపిక్ గా మారింది.