Saif Ali Khan : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు కొత్తకొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటిదాకా ముంబైలోనే కొనసాగిన ఈ కేసు విచారణ ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చేరింది. బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉన్న చప్రా పట్టణానికి చెందిన ఒక మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఎందుకు ? వివరాలు తెలియాలంటే ఈ వార్త మొత్తం చదవాల్సిందే.
Also Read :Noida TO NASA : ఆస్టరాయిడ్‌ను గుర్తించిన భారత విద్యార్థి.. నాసా బంపర్ ఆఫర్
సైఫ్‌పై దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి(Saif Ali Khan) ప్రవేశించాడు. అతగాడు వినియోగించిన సిమ్ కార్డు చప్రా పట్టణానికి చెందిన ఈ మహిళ పేరుతోనే ఉందని ముంబై పోలీసులు గుర్తించారు. అందుకే విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు భారత్‌లోకి వచ్చినప్పటి నుంచి సదరు మహిళతో ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నాడని పశ్చిమ బెంగాల్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈవిషయాన్ని ముంబై పోలీసులకు తెలియజేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు, దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్‌తో సరిపోలడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
Also Read :Chilkapalli :1947లో స్వాతంత్య్రం.. 2025లో విద్యుత్ వెలుగులు.. చిల్కపల్లిలో సంబురాలు
ఉద్యోగం కోసం సైఫ్ ఇంటి ఎదుట ధర్నా చేస్తా : ఆకాశ్ కనోజియా
ఆకాశ్ కనోజియా.. అనే పేరు కూడా సైఫ్‌పై దాడి కేసులో వచ్చింది. ఈయన వయసు 31 ఏళ్లు. డ్రైవరుగా పనిచేసేవాడు. ఈ కేసులో తన పేరు రావడంతో జీవితం నాశనమైపోయిందని అతగాడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషనులో ఆకాశ్ కనోజియాను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్‌పై దాడి కేసులో ఆకాశ్ ఉన్నాడేమోనని పోలీసులు అనుమానించారు. దీంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో ఆకాశ్ జాబ్ పోయింది. ఫలితంగా ఆవేదనకు లోనైన ఆకాశ్ కనోజియా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని సైఫ్ అలీఖాన్ ఇంటివద్దకు వెళ్లి నిలబడి నిరసన తెలుపుతానని ప్రకటించాడు. సైఫ్ ఇంటి ఎదుట నిలబడి, తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని సైఫ్‌ను డిమాండ్ చేస్తానని ప్రకటించాడు.