Site icon HashtagU Telugu

Trolls On ‘Project K’: ప్రభాస్ ‘ప్రాజెక్టు కె’పై ట్రోల్స్.. మరో ఆదిపురుష్ అంటూ కామెంట్స్!

Project

Project

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రతిష్టాత్మకమైన మూవీ ప్రాజెక్టు కే లో నటిస్తున్న విషయం తెలిసిందే. నిన్ననే చిత్ర యూనిట్ ప్రభాస్ ఫస్ట్ లుక్ ను వదిలారు. అయితే ఆ లుక్ పై విమర్శలు వస్తున్నాయి. ఆదిపురుష్ తరహాలో  ప్రభాస్ లుక్ ఉందనీ కామెంట్స్ చేస్తున్నారు. “ఆదిపురుష్”లో ఉపయోగించిన గ్రాఫిక్స్‌పై తీవ్ర విమర్శలు రావడంతో, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  “ప్రాజెక్ట్ కె” కు సైతం ఎదురుదెబ్బ తగిలింది.

“ప్రాజెక్ట్ K” భారీ బడ్జెట్‌ మూవీ. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ లో భారీ అంచనాలను పెంచింది. అయితే, ప్రభాస్ ముఖం భారీగా ఫోటోషాప్ చేయబడి ఉంది. ఆకట్టుకోలేని హెయిర్‌స్టైల్‌తో కనిపిస్తుంది.  దీంతో ట్రోలర్స్ రెచ్చిపోతూ అమీర్‌పేట్ ఇన్‌స్టిట్యూట్స్ లో ఫోటోషాప్ నేర్చుకునేవారు కూడా సినిమా యానిమేషన్ లో రాణించవచ్చు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

చాలా మంది నెటిజన్లు సినిమా ప్రచార పోస్టర్ మార్వెల్ “ఐరన్ మ్యాన్”ని అనుకరించేలా కనిపించడం నవ్వు తెప్పిస్తుంది. ఈ పరిస్థితి ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది మరో ఫెయిల్యూర్ కు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రేపు విడుదల కానుంది. టీజర్ అయినా మూవీపై అంచనాలు పెంచుతుందా ? లేదా వేచి చూడాల్సిందే.

Also Read: KTR: 70 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీకి సర్వం సిద్ధం- మంత్రి కేటీఆర్