యూత్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) తన టైమింగ్.. యాక్టింగ్ శైలి తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన సినిమాలకు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం పై అభిమానుల నుంచి తరచూ ఫీడ్‌బ్యాక్ వస్తూనే ఉంది. కానీ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్న నవీన్.. తన కథల ఎంపికలో స్లోగా, జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” తర్వాత ఆయన చేయబోయే సినిమా “అనగనగా ఒక రోజు”. మారి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను కొన్ని నెలల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
Houses : ఏపీలో వారందరికీ ఇళ్ల స్థలాలు – మంత్రి కీలక ప్రకటన
“జాతిరత్నాలు” బ్లాక్‌బస్టర్ అనంతరం నవీన్‌తో సినిమా చేయాలని కళ్యాణ్ శంకర్ “అనగనగా ఒక రాజు” అనే కథను సిద్ధం చేసుకున్నాడు. కానీ కథలో కొన్ని మార్పులు అవసరమయ్యాయి. దీంతో సినిమా సెట్స్ పైకి వెళ్లేలోగా ఆలస్యం అయింది. ఇదే సమయంలో నవీన్ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”లో బిజీ అవడంతో, కళ్యాణ్ శంకర్ తన మరో ప్రాజెక్ట్ “మ్యాడ్”పై ఫోకస్ పెట్టాడు. ఆ సినిమా చకచకా పూర్తయిపోయి మంచి విజయాన్ని అందుకుంది. కానీ నవీన్ మాత్రం “అనగనగా ఒక రాజు” కథపై నమ్మకం పెట్టుకుని దాన్ని వదలకుండా మళ్ళీ తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం నవీన్ స్క్రిప్ట్ పనిలో ఉండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ఒక రోజు పూర్తిగా కేటాయించి, కథలో కొన్ని కీలక మార్పులు సుచించారట. ఆయన ఇచ్చిన మార్పులు, సలహాలు ఈ సినిమాను మరింత మెరుగుపరిచాయని సమాచారం. తాజా వెర్షన్‌లో ఆ మార్పులు కొనసాగబోతున్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్ట్‌కు నవీన్‌తో పాటు, మారి, కళ్యాణ్ శంకర్, త్రివిక్రమ్ కలిసి నలుగురు క్రియేటర్స్ భాగమయ్యారన్నమాట. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం “అనగనగా ఒక రోజు” 2026 సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇంకా అధికారిక అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.