Trivikram : మహేష్ తో గుంటూరు కారం తర్వాత డైరెక్టర్ త్రివిక్రం అసలైతే అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం కాంబో మూవీ ఉంటుందని నిర్మాత నాగ వంశీ చెప్పారు. అంతేకాదు ఆ సినిమా ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ అని అన్నాడు. అలా చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి.
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ప్లాన్ సెట్ చేశాడని అనుకున్నారు. ఐతే పుష్ప 2 తర్వాత అసలైతే బన్నీ వెంటనే సినిమా చేయాలని అనుకున్నా కొన్ని పరిస్థితుల వల్ల కాస్త టైం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ టైం లో త్రివిక్రం మరో హీరోతో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. గురూజీ ఇప్పటివరకు డైరెక్ట్ చేయని క్రేజీ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
తెలుస్తున్న సమాచారం మేరకు మాస్ మహారాజ్ రవితేజతో త్రివిక్రం సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇన్నేళ్ల కెరీర్ లో రవితేజ, త్రివిక్రం కలిసి పనిచేసే ఛాన్స్ రాలేదు. ఐతే ఈసారి ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయినట్టే అని అంటున్నారు. రవితేజ మాస్ జాతర సినిమా పూర్తి కాగానే త్రివిక్రం తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాను సితార నాగ వంశీ నిర్మిస్తారని టాక్. రవితేజ నోటి నుంచి త్రివిక్రం డైలాగులు వస్తుంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. మరి ఈ కాంబో ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.