Site icon HashtagU Telugu

Venky : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..మరోసారి మాటల మాంత్రికుడితో ..?

Venky Trivikram

Venky Trivikram

వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ (Venkatesh – Trivikram Combination) మరోసారి ఫిక్స్ అయిందన్న వార్త అభిమానుల్లో జోష్ నింపుతుంది. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ మాటలు అందించిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తరువాత వీరిద్దరూ కలిసి పని చేయలేదు. చాలా ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ , ఏదీ వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా ఈ కలయికను సెట్ చేస్తూ, వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా మొదలుకాబోతోందన్న వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Minister Ponguleti : ‘‘ప్రజా ప్రభుత్వాన్ని కూలుస్తారా ? తండ్రీకొడుకులది అధికార దాహం’’

సంక్రాంతికి వస్తున్నాం తరువాత వెంకటేష్ ఏ సినిమా చేయాలన్న విషయంలో చాలా పరిశీలన చేసినట్లు సమాచారం. ఎన్నో కథలు విన్న వెంకీ చివరకు త్రివిక్రమ్‌తో కలిసి పని చేయాలని డిసైడ్ అయ్యారట. ఇది ఫ్యామిలీ డ్రామా జానర్‌లో ఉంటుందని టాక్. వెంకటేష్ సెంటిమెంట్, హ్యూమర్‌తో పాటు త్రివిక్రమ్ మార్క్ డైలాగులు ఈ సినిమాలో కీలకంగా నిలువనున్నాయని అంటున్నారు. షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి, వెంటనే రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో టీమ్ పని చేస్తోంది.

ఇక మరోవైపు త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమా స్క్రిప్ట్‌పై కూడా పని చేస్తున్నారు. మధ్యలో అట్లీ – బన్నీ సినిమా ఒప్పుకోవడంతో, త్రివిక్రమ్‌కి కొంత సమయం లభించింది. ఈ గ్యాప్‌లో వెంకటేష్ సినిమా పూర్తి చేసి, తర్వాత బన్నీ ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి వెంకీ – త్రివిక్రమ్ కాంబో కు సంబదించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.