Ranbir Kapoor : త్రివిక్రమ్ మాటల్లో రణ్‌బీర్, సాయి పల్లవి రామాయణం..?

ఇన్నాళ్లు తన సినిమాల్లోని డైలాగ్స్ తో రామాయణం వినిపిస్తూ వచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు రామాయణానికే డైలాగ్స్ రాయడానికి సిద్ధమవుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Trivikram Srinivas Dialogues For Ranbir Kapoor Sai Pallavi Ramayanam

Trivikram Srinivas Dialogues For Ranbir Kapoor Sai Pallavi Ramayanam

Ranbir Kapoor : బాలీవుడ్ లో మరో రామాయణం తెరకెక్కబోతుంది. ఇటీవల ప్రభాస్‌ని రాముడిగా చూపిస్తూ బాలీవుడ్ మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా ‘ఆదిపురుష్’. భారీ అంచనాలు మధ్య రిలీజైన ఈ చిత్రం ప్లాప్ టాక్ ని అందుకోవడమే కాకుండా ఎన్నో విమర్శలు, వివాదాలు ఎదుర్కొంది. ఇక ఆ సినిమా తరువాత ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ ని రాముడిగా చూపిస్తూ మరో రామాయణాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దమవుతున్న బాలీవుడ్ మేకర్స్.

‘దంగల్’ సినిమాతో ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు నితేశ్‌ తివారీ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమాని రూపొందించబోతున్నారట. ఇక ఈ రామాయణంలో సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఎందుకంటే ఆదిపురుష్ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాయి. దీంతో అలాంటి తప్పు ఈ సినిమాలో రిపీట్ అవ్వకూడదని దర్శకుడు నితేశ్‌ తివారీ జాగ్రత్త తీసుకుంటున్నారట. ఈక్రమంలోనే ప్రతి భాషకి సంబంధించిన డబ్బింగ్ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తున్నారు. ఆ డబ్బింగ్ పనులకు సంబంధించిన వర్క్స్ ని కూడా ఇప్పుడే ప్లాన్ చేస్తూ ముందుకు కదులుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలుగు డబ్బింగ్ కి త్రివిక్రమ్ చేత మాటలు రాయించడానికి మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. ఆల్రెడీ త్రివిక్రమ్ ని సంప్రదించి అంగీకారం కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు తన సినిమాల్లోని డైలాగ్స్ తో రామాయణం వినిపిస్తూ వచ్చిన త్రివిక్రమ్.. ఇప్పుడు రామాయణానికే డైలాగ్స్ రాయడానికి సిద్ధమవుతున్నారు. మరి త్రివిక్రమ్ మాటల్లో ఈ రామాయణం ఎలా ఉండబోతుందో చూడాలి. కాగా ఈ మూవీని ఈ సమ్మర్ లోనే గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట.

Also read : Tapsee pannu : తాప్సీ పెళ్లి వీడియో చూశారా.. డాన్సులు వేస్తూ వివాహం చేసుకున్న..

  Last Updated: 04 Apr 2024, 11:44 AM IST