Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తి చేసుకొని ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలతో పాటు పలు కీలక మంత్రిత్వ భాద్యతలు కూడా స్వీకరించారు. దీంతో ఆయా శాఖల పనుల పై పవన్ ఫుల్ ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో జనసైనికులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ పవర్ స్టార్ అభిమానులుగా మాత్రం నిరాశలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ దృష్టి అంతా పాలిటిక్స్ పైనే ఉండడంతో.. ఇప్పటిలో ఆయన నుంచి సినిమాలు వచ్చేలా కనిపించడం లేదు. ప్రెజెంట్ పవన్ చేతిలో ఓజి, హరిహర వీరమల్లు రెండు భాగాలు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి.
ఓజి మరియు వీరమల్లు మొదటి భాగం షూటింగ్ చివరికి వచ్చాయి. ఉస్తాద్ అయితే స్టార్టింగ్ లోనే ఉంది. ఈ సినిమాల మేకర్స్ అంతా పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం తన ఫుల్ ఫోకస్ అంతా పాలిటిక్స్ పైనే పెట్టేసారు. దీంతో ఈ ఏడాది వస్తాయి అనుకున్న ఓజి, వీరమల్లు కూడా ఈ ఏడాది వచ్చేలా కనిపించడం లేదు. ఇలా సినిమాల విషయంలో పవన్ అభిమానులు ఫుల్ నిరాశలో ఉన్నారు. అయితే ఈ సమయంలో ఓ సంఘటన పవన్ ఫ్యాన్స్ లో మళ్ళీ జోష్ ని నింపుతుంది.
అంబానీ పెళ్లికి వెళ్లిన పవన్.. అది పూర్తి చేసుకొని విజయవాడ చేరుకున్నారు. అయితే ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ కి క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. పవన్ పాలిటిక్స్ లో వచ్చిన దగ్గర నుంచి ఆయన సినిమాల విషయంలో వీరిద్దరి ప్రమేయం ఎక్కువగానే ఉంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వీరి రాక వెనుక కారణం సినిమాలేనా..? లేదా నేడు జరగబోయే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సన్మానం వేడుకకు వచ్చారా..? అనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నుంచి విజయవాడకు పవన్ కల్యాణ్ వచ్చారు. పవన్ తో పాటు వచ్చిన త్రివిక్రమ్, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి కూడా వచ్చారు. #PawanKalyan #Trivikram #AnandSai #FilmyFocus pic.twitter.com/ov8FEs1lEQ
— Filmy Focus (@FilmyFocus) July 15, 2024