Site icon HashtagU Telugu

Trivikram : త్రివిక్రం ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాడా..?

Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion

Trivikram With Mass Maharaj Raviteja Movie is on Disscussion

మాటల మాంత్రికుడు త్రివిక్రం (Trivikram) గుంటూరు కారం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో త్రివిక్రం తన మార్క్ చూపించలేకపోయాడని ఆడియన్స్ కామెంట్. మహేష్ వన్ మ్యాన్ షోనే తప్ప గుంటూరు కారం లో అసలు త్రివిక్రం ఎక్కడ కనిపించలేదన్నది అందరు అనుకుంటున్న మాట. తన మార్క్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ తో అక్కడ మామూలు సీన్ ని కూడా ఆడియన్స్ మనసుని టచ్ చేసేలా చేసే త్రివిక్రం గుంటూరు కారం లో ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు.

We’re now on WhatsApp : Click to Join

గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత త్రివిక్రం కూడా అందరు రెగ్యులర్ డైరెక్టర్స్ లా తయారయ్యాడని అనుకున్నారు. అయితే ఎలాగోలా సినిమా ఐతే సూపర్ హిట్ అయ్యింది. ఇదిలాఉంటే త్రివిక్రం నెక్స్ట్ సినిమాకు మాత్రం వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట. ఈసారి సినిమా మొత్తం తను కనిపించేలా ప్లాన్ చేస్తున్నాడట.

డైరెక్టర్ గా కన్నా రైటర్ గా త్రివిక్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. గుంటూరు కారం సినిమా విషయంలో ఎందుకో రైటింగ్ సైడ్ అంత దృష్టి పెట్టినట్టు లేడు. గురూజీ మిగతా విషయాల మీద ఫోకస్ ఎక్కువ చేసి మహేష్ సినిమాను తక్కువ చేశాడని అంటున్నారు. మరి త్రివిక్రం నెక్స్ట్ సినిమా సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి.

అసలైతే అల్లు అర్జున్ తో సినిమా అనౌన్స్ కాగా బన్నీ త్రివిక్రం కన్నా ముందు తమిళ దర్శకుడితో సినిమా చేస్తాడని అంటున్నారు. మరి త్రివిక్రం ఎవరితో చేస్తాడన్నది చూడాలి. అయితే ఎవరితో చేసినా సరే ఈసారి గురూజీ అదరగొట్టేస్తాడని చెప్పొచ్చు.

Also Read : Pooja Hegde : వెడ్డింగ్ సీజన్ అంటూ వయ్యారాల వల.. రెడ్ డ్రెస్సులో పూజా పిచ్చెక్కించేస్తుందిగా..!