Site icon HashtagU Telugu

Trivikram : గురూజీ పెన్నుకి పదును తగ్గిందెందుకు..?

Trivikram

Trivikram

రైటర్ గా తన మాటలతో హృదయాలను కదిలించే మాటల మాంత్రికుడు త్రివిక్రం (Trivikram) ఆ తర్వాత దర్శకుడిగా మారి తన కథలను చెప్పడం మొదలు పెట్టాడు. త్రివిక్రం సినిమాల్లో మనసుకి తాకే బావోధ్వేగాలు ఉంటాయి. కథ మహాద్భుతంగా లేకపోయినా పాత్రల మధ్య ఎమోషన్ ప్రేక్షకుడిని టచ్ చేస్తుంది. నువ్వే నువ్వే నుంచి అల వైకుంఠపురములో వరకు తన ప్రతి సినిమాలో తన కథ, కథనాల కన్నా తన మాటలతో గురూజీ సూపర్ అనిపించేశాడు. త్రివిక్రం మాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకునేలా చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

అయితే ఏమైందో ఏమో కానీ త్రివిక్రం లేటెస్ట్ మూవీ గుంటూరు కారం లో త్రివిక్రం పెన్ను పదును తగ్గినట్టు ఉంది. ఆయన పెన్నులో ఇంక్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. సందర్భం ఏదైనా పాత్రల మధ్య.. వారి స్వభావాల మధ్య మాటలతో ఆడుకునే త్రివిక్రం గుంటూరు కారం లో ఎమోషన్ ని పండించడంలో విఫలమయ్యాడు. జస్ట్ చివర్లో రెండు మూడు డైలాగులు తప్ప త్రివిక్రం మార్క్ కనిపించలేదు.

మహేష్ క్యారెక్టరైజేషన్.. అందుకు తగిన కొన్ని పంచ్ డైలాగ్స్ లో మాత్రమే త్రివిక్రం అక్కడక్కడ కనిపించాడు కానీ మిగతా సినిమా అంతా ఒక రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ తీసినట్టుగా గుంటూరు కారం ఉంది. త్రివిక్రం మార్క్ లేని సినిమాకు ఆయన రచన దర్శకత్వం అని వేసినట్టుగా సినిమా అనిపిస్తుంది. మొదటి నుంచి గుంటూరు కారం మీద కొంత అసంతృప్తి ఉన్నా కూడా గురూజీ ఎలాగైనా మహేష్ కి ఒక బంపర్ హిట్ ఇస్తాడని అనుకున్నారు. కానీ ఇలా సీన్ రివర్స్ అవుతుందని అనుకోలేదు.

Also Read : Hanuman Sequel Jai Hanuman : హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్.. 2025 రిలీజ్..!

మహేష్ తో అతడు, ఖలేజా సినిమాలు చేసిన త్రివిక్రం ఆ రెండు సినిమాలను కూడా పూర్తిస్థాయిలో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయలేకపోయాడు. అతడు కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించగా.. ఖలేజా థియేట్రికల్ రన్ లో ఫ్లాప్ అయ్యి బుల్లితెర మీద అద్భుతాలు చేసింది. గుంటూరు కారం కూడా థియేట్రికల్ టాక్ యావరేజ్ కాగా ఈ సినిమా బుల్లితెర మీద కూడా అదే టాక్ తెచ్చుకునేలా ఉంది.

త్రివిక్రం సినిమాల్లో కథ అనేది ఉండదు. హీరోకి ఒక లక్ష్యం ఉంటుంది.. అది సినిమా ఓపెనింగ్ అయిన పది నిమిషాల్లోనే తెలిసిపోతుంది. ఇక కథనం.. మాటల మీదే సినిమా నడిపిస్తాడు. చాలావరకు త్రివిక్రం అన్ని సినిమాలను కాస్త తన మార్క్ చూపించే ప్రయత్నం చేసినా గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం అది కనిపించలేదు. మహేష్ సినిమాను ఇలా కానిచ్చేసిన గురూజీ నెక్స్ట్ చేస్తున్న అల్లు అర్జున్ సినిమా ఎలా చేస్తాడన్నది చూడాలి.

Exit mobile version