Site icon HashtagU Telugu

Trivikram New Look : గురూజీ కొత్త లుక్.. చాన్నాళ్ల తర్వాత గడ్డెం లేకుండా..!

Trivikram Chiranjeevi Mega Fans are Early Waiting for this Combination Movie

Trivikram Chiranjeevi Mega Fans are Early Waiting for this Combination Movie

Trivikram New Look మాటల మాంత్రికుడు త్రివిక్రం రీసెంట్ గా మహేష్ తో గుంటూరు కారం సినిమా చేశారు. సంక్రాంతికి వచ్చిన ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా సినిమాలో త్రివిక్రం మార్క్ కనిపించలేదు కానీ మొత్తం సినిమా మహేష్ బాబు లాక్కొచ్చేశాడు. మహేష్ పర్ఫార్మెన్స్ తోనే గుంటూరు కారం నిలబడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఇదిలాఉంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత ఎక్కడ కనిపించని గురూజీ లేటెస్ట్ గా చిరంజీవి తో కలిసి సర్ ప్రైజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ సందర్భంగా చిరుని పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులంతా కలిసి అభినందిస్తున్నారు. త్రివిక్రం కూడా హారిక హాసిని నిర్మాత చినబాబుతో కలిసి చిరంజీవిని కలిశారు.

దీనికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే చిరుని కలిసే టైం లో త్రివిక్రం గడ్డెం ట్రిం చేసి ఉన్నారు. చాలా కాలంగా గడ్డంతో కనిపిస్తున్న త్రివిక్రం ఇలా ఒకేసారి గడ్డం లేకుండా కనిపించి ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. త్రివిక్రం నెక్స్ట్ సినిమా ఏంటి.. ఎవరితో చేస్తాడు లాంటి డీటైల్స్ మాత్రం బయటకు రావాల్సి ఉంది.

Also Read : Paruchuri Review on Prabhas Salaar : స్క్రీన్ ప్లే తో ఆటాడుకున్నాడు.. ప్రభాస్ సలార్ పై పరుచూరి రివ్యూ..!