Site icon HashtagU Telugu

Mahesh Babu Guntur Karam : గుంటూరు కారం ట్రైలర్ లో అవే ఎందుకంటే.. త్రివిక్రం తెలివైన నిర్ణయం..!

Mahesh Babu Trivikram Sreeleela Guntur Kaaram Trailer Released

Mahesh Babu Trivikram Sreeleela Guntur Kaaram Trailer Released

సూపర్ స్టార్ మహేష్ Mahesh Babu Guntur Karam త్రివిక్రం కలిసి చేస్తున్న గుంటూరు కారం సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మీద సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మహేష్ త్రివిక్రం కలిసి చేసిన అతడు, ఖలేజా సినిమాలకు ఏమాత్రం సంబంధం లేకుండా గుంటూరు కారం సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని నమ్ముతున్నారు. సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయగా లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కూడా అదరగొట్టేసింది.

We’re now on WhatsApp : Click to Join

ఇక ఈ ట్రైలర్ గురించి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాక్కావాల్సిన స్టఫ్ త్రివిక్రం ఇచ్చేశాడని అంటుంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం త్రివిక్రం టచ్ మిస్ అయ్యిందని అంటున్నారు. అయితే గుంటూరు కారం ట్రైలర్ అలా కట్ చేయడానికి రీజన్ ఫ్యాన్స్ ని ముందు ఆకట్టుకుంటే ఆ తర్వాత కామన్ ఆడియన్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తారని అలా చేశారట. ముఖ్యంగా సినిమాలో ఎక్కడ త్రివిక్రం టచ్ ఇవ్వలేదు.

తన మార్క్ డైలాగ్ కానీ, ఎమోషన్ కనిపించలేదు. పక్కా కమర్షియల్ మీటర్ లో మాస్ సినిమాగా గుంటూరు కారం తెరకెక్కించాడని తెలుస్తుంది. కానీ సినిమాలో త్రివిక్రం ఎమోషనల్ సీన్స్, డైలాగ్ రైటింగ్ ఆడియన్స్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. ఇలా ట్రైలర్ మాస్ గా కట్ చేసి సినిమాకు వచ్చిన ఆడియన్స్ మనసులు తాకాలని పెద్ద ప్లాన్ వేశాడు త్రివిక్రం. అందుకే గుంటూరు కారం ట్రైలర్ లో త్రివిక్రం అస్సలు కనిపించలేదని కొందరు ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.

అయితే సినిమా ఎలాగు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా కామన్ ఆడియన్స్ చూసేందుకు వస్తారు. మహేష్ మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి నచ్చేలా ఉంటే.. సినిమాలో కథ, కథనం, త్రివిక్రం డైలాగ్స్ కామన్ ఆడియన్స్ కి ఎక్కేస్తాయని అంటున్నారు. అల్లు అర్జున్ తో తీసిన అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన త్రివిక్రం ఈసారి అల వైకుంఠపురములో రికార్డుల మీద గురి పెట్టాడని తెలుస్తుంది. తప్పకుండా గుంటూరు కారం మంట నశాలానికి ఎక్కేలా త్రివిక్రం ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు.

Also Read : Vishnu Priya Hot in Bed : హాట్ హాట్ ఫోజులతో నిద్ర పట్టకుండా చేస్తున్న విష్ణు ప్రియ

గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించారు. సినిమాలో మహేష్ మాస్ అవతార్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందించనుందని చెప్పొచ్చు. సంక్రాంతికి సూపర్ స్టార్ సినిమా అంటే ఫ్యాన్స్ కి పండుగే అన్నట్టు లెక్క. తప్పకుండా గుంటూరు కారం మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచే ఫీచర్స్ కనబడుతున్నాయి.