మాటల మాంత్రికుడిగా పేరు పొందిన దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram ) శ్రీనివాస్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టు కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ‘గుంటూరుకారం’ సినిమా విజయవంతమైనప్పటికీ, తర్వాతి సినిమాపై ఇంకా స్పష్టత రాలేదు. అల్లు అర్జున్‌తో చేయాల్సిన చిత్రం అట్లీ ప్రాజెక్ట్ కారణంగా నిలిచిపోయింది. ధనుష్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చినా, దాని గురించి అధికారిక సమాచారం బయటకు రాలేదు. దీంతో త్రివిక్రమ్ అభిమానులు ఆయన తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Deputy CM Bhatti Vikramarka: ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ..భట్టి విక్రమర్క
ఈ నేపథ్యంలో హీరోలతో సినిమాలు డిలే అవుతుండటంతో త్రివిక్రమ్ ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీపై దృష్టి పెట్టినట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కథకు హీరోయిన్‌గా సమంత(Samantha)ను ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అఆ’ చిత్రాల్లో సమంత నటించి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి రాబోతుందన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. సమంత కూడా ఇటీవలే తనకు తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని, మంచి కథ వస్తే చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఈ కాంబో సెట్ అవుతుందనే చర్చ సాగుతోంది.
అలాగే త్రివిక్రమ్ వెంకటేష్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందనుంది. వెంకటేష్ డేట్స్ ఖరారైన వెంటనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అల్లు అర్జున్ డేట్స్ దొరికే లోపే త్రివిక్రమ్ ఒకవైపు వెంకీ సినిమాను, మరోవైపు సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్‌లో పూర్తిచేసి, బన్నీ సినిమాకు పూర్తిగా టైం కేటాయించడానికి గురూజీ ఈ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.