మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి తన కెరీర్‌లో మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ చెప్పిన కథకు ఆసక్తి కనపరిచి ఓకే చెప్పినట్లు సమాచారం. త్రివిక్రమ్ తనదైన శైలిలో చరణ్ కోసం రూపొందించిన కథకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.
AP Weather: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల అలెర్ట్ – వచ్చే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి
ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరిదశలో ఉన్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది జులైలో సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. త్రివిక్రమ్ గత చిత్రాల్లాగానే ఈ సినిమా కూడా భావోద్వేగాలతో పాటు కుటుంబ అనుబంధాల నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇక ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్‌తో కూడా రామ్ చరణ్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. దీంతో త్రివిక్రమ్ సినిమా ముందుగా ప్రారంభమవుతుందా..? లేక సుకుమార్ ప్రాజెక్టే ముందుగా సెట్స్‌పైకి వెళుతుందా..? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఏదేమైనా ఈ రెండు ప్రాజెక్టులపై అభిమానులు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్-చరణ్ కాంబినేషన్ ఇది తొలిసారి కావడం, మాస్ మరియు క్లాస్ రెండింటినీ కనెక్ట్ చేసే అవకాశాలు ఉండడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటివరకు మెగా హీరోలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కు హ్యాట్రిక్ విజయాలను త్రివిక్రమ్ ఇవ్వడం జరిగింది.