Trisha Beauty Secrets: అందాల త్రిష ‘బ్యూటీ’ సీక్రెట్స్ ఇవే!

హీరోయిన్ (Trisha) 39లో కుర్ర హీరోయిన్ లా మెరిసిపోతోంది. సరైన డైట్ పాటించడమే అందుకు కారణం.

Published By: HashtagU Telugu Desk
Trisha beauty secretes

Trisha

హీరోయిన్ త్రిష (Trisha) సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాపులర్ నటి. ఈ బ్యూటీ 39లోకి అడుగుపెట్టినా వన్నె తరగని అందంతో ప్రేక్షకులు ఎంటటైన్ చేస్తోంది. శరీరాకృతిని కాపాడుకోవడానికి రెగ్యులర్ వర్కవుట్‌లు చేస్తోంది త్రిష. డార్లింగ్ ప్రభాస్ పక్కన హీరోయిన్ నటించిన వర్షం సినిమాలో ఎలా ఉందో, ఇప్పటికే అదే అందంతో ఆకట్టుకుంటోంది. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల వ్యవధిలో ఒకే ఫిగర్‌ని కాపాడుకోవడం కష్టం. ఎవర్ గ్రీన్ లా మెరిసిపోతున్న ఈ బ్యూటీ సీక్రెట్స్ ఎంటో తెలుసా..

మేకప్ లేకుండా కూడా త్రిష (Trisha) అద్భుతంగా ఉంటుంది.  కేవలం కోల్, లైనర్, లైట్ లిప్‌స్టిక్ వేసుకుంటుంది. త్రిష కంప్లీట్ గా కెమికల్ ఫుడ్ దూరంగా ఉంటుంది. తాజా పండ్లు, వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడుతుంది. ఎక్కువ విటమిన్-సి ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇక రోజువారీ మెనూలో నారింజ, ఇతర సిట్రస్ పండ్లు కచ్చితంగా ఉంటాయి. త్రిష ఒక కప్పు గ్రీన్ టీతో రోజువారి జీవితాన్ని ప్రారంభిస్తుంది. కెఫిన్ కలిగిన పానీయాలను పూర్తిగా మానేసింది. ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మాన్ని తాజాగా ఉంచుతుందని నమ్ముతుంది. స్వచ్ఛమైన నీరు (Water) లేదా పండ్ల రసాలు వంటి ద్రవం తీసుకోవడం ఆమె ఎప్పటికీ మర్చిపోదు.

త్రిష ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ (Breakfast) కచ్చితంగా తీసుకుంటుంది, భోజనాల మధ్య మంచింగ్‌ను దూరం పెడుతుంది. ఆమె తన అల్పాహారంలో ఎక్కువగా పరాటాలు, ఆమ్లెట్లు, పెరుగు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. త్రిష తనకు ఇష్టమైన ఆహారాన్ని ఎప్పుడూ అడ్డుకోనని, అయితే తనకు నచ్చినవన్నీ తక్కువ పరిమాణంలో తింటానని చెప్పింది. ఆమెకు ఇష్టమైనవి సీఫుడ్. ఆరోగ్యం, అందాన్ని కాపాడుకోవడానికి నిద్ర కూడా కారణం. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తుంది.

త్రిష (Trisha) కొన్ని యోగా వ్యాయామాలతో తన రోజును ప్రారంభించడం తనకు ఇష్టమని, అదే తన యవ్వనంగా కనిపించే చర్మాన్ని, ఫిగర్‌ని మెయింటెయిన్ చేసే రహస్యమని ఆమె చెప్పింది. యోగా తన మనస్సును రోజంతా ప్రశాంతంగా ఉంచుతుందని, ఒత్తిడిని అధిగమించడానికి మరియు జీవక్రియను మెరుగుపరచడానికి ఇది ఒక సాధారణ టెక్నిక్ అని ఆమె చెప్పింది.

Also Read : Hrithik Roshan 8 pack: హృతిక్ రోషన్ ఎయిట్ ప్యాక్ బాడీని చూశారా!

  Last Updated: 02 Jan 2023, 03:03 PM IST