Site icon HashtagU Telugu

Trisha : విశ్వంభర సెట్ లోకి త్రిష.. హమ్మయ్య గ్లామర్ విషయంలో డోకా లేదన్నట్టే..!

Trisha Joins In Megastar Chiranjeevi Viswambhara Movie

Trisha Joins In Megastar Chiranjeevi Viswambhara Movie

Trisha మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న సినిమా విశ్వంభర. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో చిరుకి జోడీగా త్రిష నటిస్తుంది. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ లో త్రిష జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా వెళ్లడించారు. త్రిష కు విశ్వంభర యూనిట్ లోకి వెల్కం చెబుతూ ఒక పోస్టర్ మరో చిన్న వీడియో షేర్ చేశారు.

రెండు దశాబ్ధాలుగా తెలుగు తమిళ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న త్రిష సౌత్ లో ఏ హీరోయిన్ కు లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తెలుగులో అయితే స్టార్ హీరోలందరితో జత కట్టిన అమ్మడు చిరుతో కూడా స్టాలిన్ సినిమాలో కలిసి నటించింది. మళ్లీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇన్నేళ్లకు మరోసారి చిరంజీవి సరసన నటిస్తుంది.

Also Read : Grammy Awards : జాకిర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లకు గ్రామీ అవార్డులు

విశ్వంభర సినిమాలో త్రిష నటించడం వల్ల సినిమాకు కావాల్సిన గ్లామర్ ట్రీట్ ఉన్నట్టే. ఈమధ్య పి.ఎస్ 1, 2 సినిమాలతో పాటుగా లియో సినిమాల్లో తన లుక్స్ తో ఆడియన్స్ ని అలరించిన త్రిష చాలా కాలం తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమాలో త్రిష నటించడం మెగా ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కు సూపర్ ఫీస్ట్ అని చెప్పొచ్చు.

ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే చిరు ప్రెస్టీజియస్ గా చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ని వశిష్ట భారీ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. టైటిల్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన వశిష్ట సినిమాతో నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు.